‘స్వతంత్ర భారతంలో చావు కూడా పెళ్ళిలాంటిదే బ్రదర్..’ అన్నాడు వెనకటికి ఓ సినీ కవి. చైనాలోని వుహాన్‌లో వెలుగు చూసిన కోవిడ్ 19 వైరస్‌కి (wuhan virus corona virus covid 19 china virus) బర్త్ డే సెలబ్రేషన్స్ చేసేస్తున్నారు కొందరు నెటిజన్లు. ఆప్ఘనిస్తాన్‌లో తీవ్రవాదులున్నారంటూ.. అక్కడ ఏళ్ళ తరబడి తుపాకుల మోత మోగించేస్తోంది అమెరికా.
ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇలాంటి పరిస్థితులున్నాయి. సరిహద్దుల్లో భారత్ – పాక్ మధ్య గొడవల సంగతి సరే సరి. కానీ, ఒక్క చైనా.. ఓ చిన్న వైరస్‌తో ప్రపంచాన్ని గడగడలాడించేస్తోంటే, వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకుంటోంటే.. వేల కోట్లు.. లక్షల కోట్ల సంపద ఆర్థిక సంక్షోభం కారణంగా ఆవిరైపోతోంటే.. చైనా విషయంలో అమెరికా సహా ఏ దేశమూ స్పందించాల్సిన స్థాయిలో స్పందించకపోవడం గమనార్హం.
చైనాలో దాదాపు 85 వేల కరోనా పాజిటివ్ కేసులు, ఓ నాలుగు వేల మరణాలతో ‘కరోనా వైరస్’ కథ దాదాపు ముగిసిపోయింది. మన దేశం పరిస్థితేంటి.? అమెరికా సంగతేంటి.? బ్రిటన్ సహా చాలా దేశాల్లో పరిస్థితులు ఏంటి.? ప్రపంచంలో ఎక్కడా కనీ వినీ ఎరుగని రీతిలో ‘లాక్‌డౌన్లు’ షురూ అయ్యాయి.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యింది. కంటికి కనిపించని ఓ వైరస్, ప్రపంచంతో ఫుట్‌బాల్ ఆడేసుకుంది. ‘నేటితో కరోనా వైరస్ వుహాన్‌లో వెలుగు చూసి ఏడాది’ అంటూ ఈ సమయంలో తలచుకుని కొందరు మురిసిపోతోంటే, నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి.. కరోనాతో బాధపడుతున్న దేశాల్లోని వారి పరిస్థితి.
‘మేం కూడా బాధితులమే.. మేం, ఆ వైరస్‌ని సృష్టించలేదు..’ అని చైనా బుకాయింపులు కొనసాగుతూనే వున్నాయి. కానీ, ఆ వైరస్ చైనా నుంచే ప్రపంచానికి విస్తరించింది. కరోనా వైరస్‌పై వాస్తవాలు ముందే తెలిసినా, ప్రపంచ దేశాల్ని అప్రమత్తం చేయడంలో చైనా విఫలమయ్యింది.
ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రపంచం మీద చైనా కరోనా వైరస్‌తో ‘బయో వార్’ చేసిందని అనుకోవచ్చు. దీపావళి టపాసుల్ని చైనా నుంచి దిగుమతి చేసుకోలేదు కాబట్టి, చైనాకి ఆర్థికంగా దెబ్బ.. అని మనం మురిసిపోతున్నాం. కానీ, చైనా వైరస్‌తో మన దేశంలో పోయిన వేలాది ప్రాణాల మాటేమిటి.?
కరోనా దెబ్బకి, మాస్క్ ధరించడం తప్పనిసరి అయిపోయింది. శానిటైజర్ల వాడకం పెరిగిపోయింది. భవిష్యత్తు ఇంకెంత భయానకంగా వుంటుందోనన్న ఆందోళన ప్రజలందరిలోనూ కనిపిస్తోంది. చైనా వైరస్.. (wuhan virus corona virus covid 19 china virus) అదేనండీ కరోనా వైరస్.. మొదటిది కాదు.. చివరిదీ కాదు. ఇప్పటివరకు అయితే కరోనా వ్యాక్సిన్ రాలేదు.. ఎప్పుడొస్తుందో తెలియదు.
ఇంకో వైరస్ ఇలాంటిది రాదన్న గ్యారంటీ కూడా లేదు. కొత్తదేమైనా వస్తే ఏంటి పరిస్థితి.?