Table of Contents
Covid Vaccine Heart Problem.. కొండ నాలిక్కి మందేస్తే.. అసలు నాలుక ఊడిపోయిందన్నది వెనకటికి ఓ సామెత.! అలాగే తయారయ్యిందిప్పుడు పరిస్థితి.!
కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో ఎడా పెడా వ్యాక్సిన్లు పొడిచేశారు. ప్రాణాపాయం నుంచి తప్పించుకోవాలంటే వ్యాక్సిన్ వేసుకోవాల్సిందేనన్నారు.!
ఏమో, చచ్చిపోతామేమో.. అని ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్లు పొడిపించేసుకున్నారు కూడా. ఒకటి కాదు, రెండు కాదు.. మూడు డోసులూ పూర్తయిపోయాయ్.!
కోవిడ్ గుండె జబ్బులు..
గుండె జబ్బులనేవి చాపకింద నీరులా విస్తరిస్తున్నాయ్. చిన్న వయసులోనే గుండె పోట్లు సర్వసాధారణమైపోయాయి ఈ మధ్య.
రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడటం.. అనేది కోవిడ్ వ్యాక్సినేషన్ తర్వాత చాలామందిలో కనిపిస్తోన్న సమస్య.
అంటే, ఇది కేవలం గుండెకే పరిమితం కాదు. బ్రెయిన్ స్ట్రోక్స్ సహా.. చాలా సమస్యలకు కారణమవుతోంది. కానీ, వాటి పట్ల అవగాహన ఎంతవరకు వుంది.? అధ్యయనాలు ఏం చెబుతున్నాయ్.?
ఎవరిది బాధ్యత.? ఈ గండం గట్టెక్కేదెలా.?
Mudra369
అసలు దీనికి కారణమేంటి.? అని ఆరా తీస్తే, కోవిడ్ నేపథ్యంలో వేసిన వ్యాక్సిన్ల పుణ్యమేనని తేలింది.
పేర్లు ప్రస్తావించడమెందుకుగానీ, కొన్ని బ్రాండ్ల వ్యాక్సిన్లతో రక్తం గడ్డకట్టే అవకాశం వుంటుందని మొదట్లోనే ప్రచారం జరిగింది.
‘ప్రాణమంటూ వుంటేనే కదా.. గుండె జబ్బులు వచ్చినా.. రాకున్నా..’ అంటూ వైద్యులూ తప్పనిసరై, వ్యాక్సిన్ల దిశగా జనాన్ని ప్రోత్సహించాల్సి వచ్చింది.
Covid Vaccine Heart Problem.. ఈ పాపం ఎవరిది.?
కోవిడ్ వ్యాక్సిన్ వరం కాదు.. శాపమని తేలుతోంది. కోవిడ్ సోకినా.. ఆరోగ్యవంతుల్లో పెద్దగా ఇబ్బంది వుండదని మొదట్లోనే అంతా చెప్పారు.

సరే.. కోవిడ్ ఎవరి మీద ఎలా ప్రభావం చూపిందన్నది వేరే చర్చ. కానీ, వ్యాక్సిన్ల పుణ్యమా అని గుండె జబ్బులతో ఆసుపత్రి పాలవుతున్నవారి సంఖ్య పెరుగుతోంది.
మరోపక్క, ఆకస్మిక గుండెపోటుతో పోతున్న ప్రాణాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోయింది. ఈ పాపం ఎవరిది.?
గుండె జబ్బుకి అసలు కారణమేంటో తెలిసింది. మరి, దానికి విరుగుడు ఎలా.?
140 కోట్ల మంది జనాభా వున్న భారతదేశంలో వ్యాక్సిన్ (Corona Virus Vaccine) తీసుకున్న ఒక్క శాతం ప్రజలకు గుండె పోటు ముప్పు అన్నాగానీ.. అది అత్యంత తీవ్రమైనది.
కానీ, 10 శాతం వరకూ ప్రమాదమంటున్నారు. అంటే, ముందు ముందు భారతదేశం (India Covid 19) అతి పెద్ద విపత్తుని ఎదుర్కోబోతోందన్నమాట గుండె జబ్బుల రూపంలో.!
కోవిడ్ వ్యాక్సిన్‌తో (Covid Vaccine) గుండె జబ్బుల ముప్పు.? ఎంత అన్న విషయమై ప్రభుత్వాలే అధ్యయనం చేయాలి.. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి.!
Also Read: ‘చిత్రం’ చెప్పే కథ.! రాసుకున్నోడికి రాసుకున్నంత.!
వ్యాక్సిన్లు పంచినంత వేగంగా.. కాదు కాదు, అంతకు మించిన వేగంతో.. కోవిడ్ (Covid 19 Corona Virus) గుండె జబ్బులకి విరుగుడునీ జనానికి అందజేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీదనే వుంది.
లేదూ.. అలాంటి ప్రమాదమేమీ లేదని అధ్యయనాల్లో తేలితే.. ఆ విషయమ్మీద అయినా ప్రజల్లో అవగాహన పెంచాలి.
అనుమానం.. పెనుభూతం.! అనుమానపు భయాలతో గుండె పోటు ముప్పు.. వంద రెట్లు పెరుగుతుంది మరి.!