క్రికెట్.. దీని గురించి ప్రపంచంలో కొన్ని దేశాలు అస్సలే ఆలోచించవు. కానీ, క్రికెట్ అంటే దాన్నొక అద్భుతంగా అభిమానించే, ప్రేమించే, ఆరాధించే అభిమానులు కోట్లాదిగా వున్న దేశాలూ లేకపోలేదు. ఇండియాలో అయితే, క్రికెట్‌కి వున్నంత క్రేజ్ మరే ఇతర ఆటకీ లేదని (Cricket On Mars And Moon) నిస్సందేహంగా చెప్పొచ్చు.
క్రికెట్ ఆటని నేలమీదే ఎందుకు ఆడాలి.? ఏ చంద్రుడి మీదనో, ఏ అంగారకుడి మీదనో ఎందుకు ఆడకూడదు.? అన్న ప్రశ్న కొత్తగా తెరపైకొచ్చింది. జస్ట్ ఫర్ ఫన్.! ఏదో సరదాకి ఇప్పుడు ఇలా అనుకుంటున్నాంగానీ, భవిష్యత్తులో క్రికెట్ పోటీలు వేరే గ్రహాల మీద కూడా జరగొచ్చేమో.! ఇందుకు సంబంధించిన మీమ్స్ సోషల్ మీడియాలో చాలానే దర్శనమిస్తున్నాయి.
అంగారకుడి మీదకు ఇటీవల నాసా ఓ రోవర్‌ని పంపిన విషయం విదితమే. ఆ రోవర్ అక్కడ కనీసం రెండేళ్ళు పనిచేస్తుంది. దానికి సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు వింటూనే వున్నాం. రోవర్, అంగారకుడి మీద దిగిందనగానే.. ఇక్కడ మీమ్స్ మొదలయ్యాయి.. క్రికెట్‌తో లింక్ పెడుతూ.
అంగారకుడిపై క్రికెట్ ఆడాల్సి వస్తే, టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవాలా.? ఫీల్డింగ్ ఎంచుకోవాలా.? పిచ్ మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకి అనుకూలిస్తుందా.? అవతలి జట్టుకి కలిసొస్తుందా.? వంటి అమాయకపు ప్రశ్నలు అప్పుడే సోషల్ మీడియా వేదికగా పుట్టుకొస్తున్నాయి.
ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ మీమ్స్ పట్ల ఐసీసీ (Cricket On Mars And Moon) కూడా స్పందించింది. క్రికెట్ విశ్వ వ్యాపితం.. అని తాము ఎప్పటినుంచో చెబుతున్నామంటూ ఐసీసీ స్పందించడం గమనార్హం. అన్నట్టు, యూ ట్యూబ్‌లోనూ, సోషల్ మీడియా వేదికల మీదా పలు వీడియోలు.. గ్రాఫిక్స్‌తో రూపొందించేసి.. వదిలేశారు.. అంతరిక్షంలో క్రికెట్ గురించి.
ఇవన్నీ ఇప్పటికి జస్ట్ ఫర్ ఫన్ మాత్రమే కావొచ్చు.. భవిష్యత్తులో ఇదే నిజం అయినా ఆశ్చర్యపోవాల్సిన పని వుండదేమో.