తమ సమస్యలు పరిష్కరించాలంటూ, నిరుద్యోగులు ప్రజాస్వామ్య పద్ధుతుల్లో నిరసన తెలిపితే, వారికి హెచ్చరికలు వెళుతుంటాయి.. మీ మీద కేసులు నమోదైతే, ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని. మరి, చట్ట సభల్లోకి నేర చరితులు (Criminals In Politics Indian Democracy) ఎలా వెళుతున్నారు.? వాళ్లకి పోలీసులెందుకు సెల్యూట్ చేస్తున్నారు.?
సగటు భారతీయుడి ఆవేదన ఎప్పటికీ చల్లారదు. ఎందుకంటే, పవిత్ర దేవాలయంలాంటి చట్ట సభల్లోకి నేర చరితులు వెళుతుంటే, అలాంటి వారి కను సన్నల్లో చట్టాలు రూపుదిద్దుకుంటూ ఉంటే, ప్రజాస్వామ్యం బతికున్నట్టా.? చచ్చిపోయినట్టా.? అని సామాన్యుడు గగ్గోలు పెట్టడంలో వింతేముంది.?
Also Read: అప్పు చేసి పప్పు కూడు, ఇదీ.. సర్కారు వారి పాట.!
సర్వోన్నత న్యాయస్థానం చట్ట సభల్లో నేర చరితుల ఉనికిపై అసహనం వ్యక్తం చేసింది. రాజకీయ పార్టీలు తమ అభ్యర్ధుల నేర చరిత్రను బయట పెట్టాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా, ఆ ఆదేశాల్ని రాజకీయ పార్టీలు పెడచెవిన పెడుతున్నాయి. నేర చరితులకు టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యతనిస్తున్నాయి.
ఇకపై అలాంటి దుర్మార్గాలకు ఆస్కారం లేకుండా అభ్యర్ధుల నేర చరిత్రను 48 గంటల్లోగా రాజకీయ పార్టీలు వెల్లడించాలని సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. మరోపక్క, ప్రజా ప్రతినిధులపై నమోదైన కేసుల్ని ప్రభుత్వాలు తమ ఇష్టానికి ఎత్తి వేస్తే, కుదరదని కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
Also Read: ఆన్‌లైన్ బూతు బాగోతం.. ఈ రోగానికి వ్యాక్సిన్ ఏదీ.?
ఓ చిన్న నేరం.. ఓ దొంగతనం లాంటివి.. చేస్తే, అంతే సంగతులు. కానీ, రాజకీయ నాయకులు పెద్ద పెద్ద నేరాలు చేసేసి తేలిగ్గా తప్పించుకుంటారు. హత్య కేసులూ గల్లంతైపోతాయి. కుప్పలు తెప్పలుగా కేసుల్ని నేత్తినేసుకున్నోళ్లు అధికార పీఠమెక్కేస్తుంటారు. అంటే, కేవలం నేరస్థులకే రాజ్యాధికారం.. అని అనుకోవాలా.? వాళ్లని నిందితులుగానో, దోషులుగానో అప్పటిదాకా చూసే పోలీసులు, ఆ తర్వాత వాళ్లను అధికారంలో ఉండగా చూసి, సెల్యూట్ చేయడం ఏ నైతికతకు నిదర్శనం.?
అధికారంలోకి రాగానే, తమ మీద కేసుల్ని ఎత్తేసుకుంటున్నప్రబుధ్ధులు బోలెడంత మంది మన రాజకీయాల్లో ఉన్నారు. ఇలాంటి వ్యవస్థ మారుతుందా.? కరెన్సీ నోట్లతో ఓట్లను కొనేయగలుగుతున్నప్పుడు ప్రజా కోర్టులో నేరస్థులు కూడా విజేతలే అవుతారు. మార్పు ఓటర్ల దగ్గర నుంచే మొదలవ్వాలి. అంతేకానీ, రాజకీయ నేరస్థుల్లో (Criminals In Politics Indian Democracy) మంచి మార్పు వస్తుందని ఆశించలేం.