Custody First Report.. అక్కినేని నాగచైతన్య తాజా చిత్రం ‘కస్టడీ’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘ఇది తెలుగు సినిమానే..’ అని పదే పదే నాగచైతన్య చెప్పుకోవాల్సి వచ్చిన సంగతి తెలిసిందే.
కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది ఈ సినిమాలో. గత కొద్దికాలంగా కృతి శెట్టి టైమ్ బాగా లేదు. బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్లు. నాగచైతన్య కూడా ఓ డిజాస్టర్ రిజల్ట్ తర్వాత వస్తున్న సినిమా ఇది.!
ఇంతకీ, ‘కస్తడీ’ ఎలా వుంది.? అందుతున్న సమాచారం ప్రకారం, ‘కస్టడీ’ సినిమాలో తమిళ వాసనలు ఎక్కువైపోయాయి. సినిమా చాలా స్లోగా సాగుతుందని అంటున్నారు.
Custody First Report.. మరీ అంత నాసిరకమా.?
నాగచైతన్య సినిమాలోని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా చాలా స్పెషల్.. అని చెబుతూ వచ్చాడుగానీ, అదేమంత బాగాలేదన్న భావన వ్యక్తమవుతోంది సినిమా ఫస్ట్ రిపోర్ట్స్‌ని బట్టి చూస్తే.
రెట్రో ఫీల్ సరే.. కథ, కథనాలు కూడా రెట్రో తరహాలో.. అంటే, నాసిరకంగా వుంటే ఎలా.? అన్న ఫిర్యాదులూ వస్తున్నాయి ప్రీమియర్ రిపోర్ట్స్‌లో.
Also Read: Seerat Kapoor: ఎగిరిపోతాం.! మాకు రెక్కలతో పన్లేదు.!
ఈ సినిమాలో అరవ నటులే ఎక్కువగా వున్నారు. నాగచైతన్య తనవరకూ బాగానే కష్టపడినా, కథ కథనాల్లో పస లేకపోవడం.. అతని కష్టం వృధా అయ్యేలా చేసిందంటున్నారు.
ఇంతకీ, ఇదే ఫైనల్ రిపోర్ట్ అనుకోవచ్చా.? కాస్సేపట్లో పూర్తి రివ్యూ రాబోతోంది. అప్పుడు పూర్తిగా క్లారిటీ వస్తుంది. స్టే ట్యూన్డ్.!