Deepika Padukone Allu Arjun.. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.
హాలీవుడ్ సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పని చేయనున్నారు. ఇది రెగ్యులర్ ఫార్మాట్ సినిమా కాదు. హాలీవుడ్ స్థాయి.. అంతకు మించిన సినిమా.. అంటూ ప్రచారం జరుగుతోంది.
అందుకు తగ్గట్టే, చిత్ర నిర్మాణ సంస్థ బడ్జెట్‌ని కూడా ఓ రేంజ్‌లో ప్లాన్ చేసింది. అల్లు అర్జున్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమ ఇది.
తాజాగా, ఈ సినిమా కోసం ఫిమేల్ లీడ్ ఫైనల్ అయ్యింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
Deepika Padukone Allu Arjun.. అక్కడ తేడా కొట్టిందిగానీ..
ప్రముఖ దర్శకుడు సందీప్ వంగా తెరకెక్కించనున్న ‘స్పిరిట్’ సినిమా కోసం తొలుత బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే పేరు ప్రచారంలోకి వచ్చింది.
‘స్పిరిట్’ టీమ్ ఈ విషయాన్ని కన్ఫామ్ చేసింది కూడా గతంలో. అయితే, తాజాగా దీపిక స్థానంలోకి తృప్తి దిమ్రి వచ్చి చేరింది. క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా దీపిక, ‘స్పిరిట్’ నుంచి తప్పుకుంది.
అదే సమయంలో, దీపిక చేతిలోకి అల్లు అర్జున్ – అట్లీ కాంబో వచ్చి చేరింది. కథని దీపికకి నేరేట్ చేయడంతోపాటు, లుక్ టెస్ట్ కూడా పూర్తి చేశాడు దర్శకుడు అట్లీ.
వీడియో అదిరింది..
దీపిక లుక్ టెస్ట్ నిమిత్తం రూపొందించిన ఓ వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్.
అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్‌లో దీపిక పదుకొనే నటిస్తోన్న సినిమా రేంజ్ ఎలా వుండబోతోందో ఈ వీడియో చూస్తే ఇట్టే అర్థమయిపోతుంది.
Also Read: చక్కని చుక్క.. లక్కు తోక తొక్కినాదిరో.!
‘పుష్ప’తో జాతీయ స్థాయిలో అల్లు అర్జున్ పేరు నటుడిగా మార్మోగిపోయింది. అంతర్జాతీయ స్థాయిలోనూ అల్లు అర్జున్ తన ఉనికిని చాటుకోబోతున్నాడు అట్లీ సినిమాతో.
అట్లీ గతంలో ‘జవాన్’ సినిమాని బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్‌తో తెరకెక్కించిన సంగతి తెలిసిందే.