Deepika Padukone Lost Kalki2.. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే.. ఇలా ప్రముఖ తారాగణంతో ‘కల్కి’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.
వైజయంతీ మూవీస్ పతాకంపై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘కల్కి’ సినిమా రూపొందింది. త్వరలో, ‘కల్కి-2’ సెట్స్ మీదకు రానుంది.
ప్రభాస్ ప్రస్తుతం చేతిలో వున్న సినిమాల్ని ఓ కొలిక్కి తీసుకొచ్చాక, ‘కల్కి-2’ సినిమా పనుల్లో బిజీ అవుతాడు. ఈలోగా, దర్శకుడు నాగ వంశీ, ప్రీ-ప్రొడక్షన్ వ్యవహారాలు చక్కబెట్టేస్తున్నాడు.
Deepika Padukone Lost Kalki2.. దీపిక హిట్ వికెట్..
తాజాగా, ‘కల్కి’ టీమ్, తమ ప్రాజెక్టు నుంచి దీపిక పదుకొనే తప్పుకుందని ప్రకటించడంతో, ఒక్కసారిగా ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది.
కొన్నాళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా ప్రాజెక్టు నుంచి కూడా దీపిక పదుకొనే తప్పుకుంది. దీపిక స్థానంలో, త్రిప్తి దిమ్రిని ఆ ప్రాజెక్టులోకి తీసుకున్నారు.
Also Read: ’ఉప్పు కప్పురంబు‘ రివ్యూ: పురుషులందు పుణ్య పురుషులెవరయ్యా.!
అప్పట్లో, సందీప్ రెడ్డి వంగా మీద బాలీవుడ్ మీడియా ఓ రేంజ్‌లో నెగెటివ్ కథనాల్ని ప్రచారంలోకి తీసుకొచ్చింది. అదంతా దీపిక చేసిన పెయిడ్ ప్రచారమన్న ఆరోపణలూ లేకపోలేదు.
దీపిక, ‘కల్కి-2’ నుంచి తప్పుకోవడం వెనుక కూడా బలమైన కారణాలే వున్నట్లు తెలుస్తోంది. అవేంటన్నది ముందు ముందుకు బయటకు రానుంది.

కాగా, దీపిక స్థానంలోకి ఎవరొస్తారు.? అన్నదానిపై రకరకాల స్పెక్యులేషన్స్ వినిపిస్తున్నాయి. సౌత్ నుంచే ఓ బ్యూటీని ఈ ప్రాజెక్టు కోసం ఖరారు చేసే అవకాశాలున్నాయట.
చిత్రమేంటంటే, దీపిక తప్పుకున్న రెండు ప్రాజెక్టులూ తెలుగు దర్శకులకు సంబంధించినవే. మరో సౌత్ డైరెక్టర్ అట్లీతో అల్లు అర్జున్ సినిమా కోసం కమిట్ అయ్యింది దీపిక పదుకొనే.
అల్లు అర్జున్ – అట్లీ ప్రాజెక్టులో అయినా దీపిక కొనసాగుతుందా.? అందులోంచి కూడా తప్పుకునే అవకాశాలేమైనా వున్నాయా.?
