Deepthi Sunaina Shanmukh Jaswanth Love story షన్ముఖ్ జస్వంత్ అలియాస్ షన్నూ.. అలాగే దీప్తి సునయన.. ఈ ఇద్దరి మధ్యా చాలాకాలంగా ‘లవ్ ట్రాక్’ నడుస్తోంది. ఇద్దరూ యూ ట్యూబర్స్. యూ ట్యూబ్‌లో వీళ్ళ వీడియోలకి వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. విడివిడిగా, జంటగా.. ఈ ఇద్దరూ పలు వీడియోలు చేశారు.
ప్రస్తుతం షన్నూ.. బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్ కంటెస్టెంట్‌గా వున్న విషయం విదితమే. అన్నట్టు, దీప్తి సునైన కూడా గతంలో బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్‌గా కనిపించింది. నాని హోస్ట్‌గా వ్యవహరించిన ‘బిగ్ బాస్ తెలుగు 2’లో ఆమె ఓ కంటెస్టెంట్.
ఇక, షణ్ముఖ్ కోసం దీప్తి సునయన సోషల్ మీడియాలో బాగానే సందడి చేస్తోంది. తన లవర్ దీప్తి సునయన.. అని ఇప్పటికే బిగ్ హౌస్ సాక్షిగా షన్ముఖ్ ప్రకటించేశాడు. షన్ముఖ్ – దీప్తిల మధ్య లవ్ ట్రాక్ వ్యవహారాన్ని బిగ్ బాస్ ఫుల్లుగా వాడేయడం మామూలే.
ఇంతకీ, షన్ముఖ్ – దీప్తిల మధ్య ప్రేమ నిజమైనదేనా.? లేదంటే, ఇదంతా డ్రమెటిక్ వ్యవహారమా.? పాపులారిటీ పెంచుకోవడానికి ఇద్దరూ కలిసి అందమైన ‘నాటకానికి’ తెరలేపారా.? ఇలా చాలా ప్రశ్నలున్నాయి. జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్, జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ మధ్య ‘డ్రమెటిక్’ లవ్ స్టోరీ గురించి అందరికీ తెల్సిందే. ఆ స్థాయిలో బిగ్ బాస్ వేదికగా షన్ముఖ్ – దీప్తిల లవ్ ట్రాక్‌ని హైలైట్ చేసే ప్రయత్నాలైతే షురూ అయినట్లే కనిపిస్తోంది.
కాగా, షన్ముఖ్ పుట్టినరోజు సందర్భంగా దీప్తి సునయన తన బాయ్‌ఫ్రెండ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు (Deepthi Shanmukh Love Story) తెలిపింది.. ‘లవ్ సింబల్’ని ప్రస్తావిస్తూ.
