Table of Contents
Dental Problems Home Remedies.. అమ్మో పంటి నొప్పి.. అంటూ బాధతో విలవిల్లాడుతున్నారా.? ‘మీ టూత్ పేస్టులో ఉప్పు వుందా..’ అనే ప్రశ్నతో ఏ అందమైన అమ్మాయి కూడా మీ ముందుకు అకస్మాత్తుగా వచ్చి పడదు. కేవలం అంది ప్రకటనలకే పరిమితం. టూత్ పేస్టులో ఉప్పు వుండటమేంటి.? టూత్ పేస్టులో చార్కోల్.. అదేనండీ, బొగ్గు వుండటమేంటి.?
టూత్ పేస్టులో ఏముంటుంది.? అన్నది వేరే చర్చ. అసలంటూ మీ నోటిలో వున్న సమస్యలేంటి.? అది ముందుగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవచ్చు. సాధారణంగానే నోటి అల్సర్లు చాలామందిని వేధిస్తుంటాయి. చిగుళ్ళ వాపు కూడా సర్వసాధారణమే. కానీ, వీటిని నిర్లక్ష్యం చేస్తే.. అంతే సంగతులు.
Also Read: దోచుకున్నోడికి దోచుకున్నంత
పంటి చుట్టూ గార పట్టడం అనేది చాలామందిలో చూస్తుంటాం. పళ్ళ మధ్యన ఆహార పదార్థాలు ఇరుక్కుపోవడం మరో సమస్య. ఇలా రకరకాల కారణాలతో చిగుళ్ళలో వాపు వస్తుంది.. అశ్రద్ధ చేస్తే దంతాలు పాడైపోతాయ్. కొంచెం కొంచెంగా పళ్ళు పుచ్చిపోవడం, చివరికి పళ్ళు ఊడిపోయే పరిస్థితి రావడం జరుగుతుంటుంది.
పంటి సమస్య సరే, పరిష్కారమేంటి.?
ఉదయం, సాయంత్రం.. తప్పనిసరిగా బ్రష్ చేయాల్సిందే. రాత్రి ఆహారం తీసుకున్నాక, కాస్సేపటి తర్వాత బ్రష్ చేసుకోవడం అస్సలు మర్చిపోకూడదు. రోజూ రెండు పూటలా బ్రష్ చేస్తే, నోటి భాగం మొత్తం శుభ్రంగా, ఆరోగ్యకరంగా వుంటుంది. దంతాలకు గార పట్టడం, చిగుళ్ళ వాపు వంటి సమస్యలకు దూరంగా వుండొచ్చు.
ఆరోగ్యకరమైన ఆహారం, శరీరానికి అవసరమైనన్ని విటమన్లుండే ఆహారం తీసుకోవడం తప్పనిసరి. ఎందుకంటే, విటమిన్ల సమస్యల కారణంగా కూడా చిగుళ్ళలో వాపు వచ్చే అవకాశం వుందని దంత వైద్య నిపుణులు చెబుతుంటారు. కుదిరితే మౌత్ వాష్ వినియోగించడం.. లేదంటే, గోరు వెచ్చటి నీళ్ళలో కాస్త ఉప్పు వేసి పుక్కళించడం.. ద్వారా దంత సమస్యలు దరిచేరకుండా చేసుకోవచ్చు.
Also Read: బూతు బాగోతం.. ఈ రోగానికి వ్యాక్సిన్ ఏదీ.?
మంచి టూత్ పేస్టుని, సరైన పద్ధతిలో వాడటం ద్వారా, బ్రష్ సరైన పద్ధతిలో చేయడం ద్వారా పంటి సమస్యలకు దూరంగా వుండొచ్చు.
సమస్య వచ్చాక ఏం చేయాలి.?
చిన్న చిన్న సమస్యలే అయితే, సాధారణంగా వంటింట్లో.. పోపుల పెట్టెలో దొరికే వాటితోనే ఉపశమనం పొందవచ్చు. పంటి నొప్పి కాస్త ఎక్కువగా వుంటే, సత్వర ఉపశమనం కోసం లవంగ నూనెను వినియోగించొచ్చు. పంటి భాగంలో లవంగాన్ని కొంత సేపు వుంచినా, సాంత్వన కలుగుతుంది.
Also Read: శృంగార విద్యాభ్యాసం.?
కోల్డ్ కంప్రెసర్.. అంటే, చల్లని నీళ్ళు లేదా ఐస్ వున్న చిన్నపాటి బ్యాగ్, నొప్పి వున్న భాగంలో వుంచినా.. నొప్పి తగ్గుతుంది. వెల్లుల్లి నొప్పిని తగ్గించడమే కాదు, ఇన్‌ఫెక్షన్ తీవ్రతను తగ్గించే గుణాల్ని కలిగి వుంటుంది.
డాక్టర్ సలహా తప్పనిసరి..
ముంచేసే వైద్యుడ్నికాకుండా మంచి వైద్యుడ్ని సంప్రదించి, పంటి సమస్యలపై (Dental Problems Home Remedies) తగిన కౌన్సిలింగ్.. అలాగే అవసరమైన వైద్య చికిత్స పొందాల్సిందే. ముంచేసే డాక్టర్ దగ్గరకు వెళితే మాత్రం, పర్సు ఖాళీ అయిపోతుంది.. నోట్లో దంతాలు కూడా ఖాళీ అయిపోయే ప్రమాదమేర్పుడుతుంది.