Deputy CM Pawan Kalyan.. డిప్యూటీ సీఎం పదవికి రాజ్యాంగంలో వున్న అదనపు అధికారాలేంటి.? అంటే, ఏమీ లేవనే చెప్పాలి.!
మంత్రి పదవికి ఏ అధికారాలు వుంటాయో, అంతకు మించిన అధికారాలేమీ ఉప ముఖ్యమంత్రికి వుండవు. అందుకే, ఉప ముఖ్యమంత్రులకు తగిన గుర్తింపు వుండదు.
కానీ, అది ఒకప్పటి మాట.! ఉప ముఖ్యమంత్రి పదవికి పవన్ కళ్యాణ్ బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. ఆ పదవికి పవన్ కళ్యాణ్ తనదైన ‘పవర్’ని అద్దారు.!
కాకినాడ సముద్రంలోకి వెళ్ళి, ‘సీజ్ ది షిప్’ అని నినదించినా, కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో అయినా.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తానెంత ప్రత్యేకమో నిరూపించుకుంటున్నారు.
Deputy CM Pawan Kalyan.. హీ ఈజ్ స్పెషల్.!
వైసీపీ హయాంలో ఉప ముఖ్యమంత్రులుగా కొందరు పని చేశారు. అంతకు ముందు టీడీపీ హయాంలోనూ ఉప ముఖ్యమంత్రులుగా పని చేసినవారున్నారు.. కానీ, వాళ్ళెవరికీ రాని గుర్తింపు పవన్ కళ్యాణ్‌కి దక్కింది.
టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక, ఉప ముఖ్యమంత్రి అనే పదవికి ప్రత్యేకమైన గౌరవం ఇస్తూ, ఆ పదవిలో కేవలం పవన్ కళ్యాణ్‌కి మాత్రమే అవకాశమిచ్చింది కూటమి ప్రభుత్వం.
తనకు దక్కిన ఆ ప్రత్యేకమైన గౌరవం నేపథ్యంలో, ఆ పదవికి ఓ చారిత్రక గుర్తింపుని అద్దేందుకు పవన్ కళ్యాణ్ శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారన్నది నిర్వివాదాంశం.
Also Read: మళ్ళీ ఎందుకు కెలుక్కున్నావ్ అల్లు అర్జున్.?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ద్వారా ‘డిప్యూటీ సీఎం’ అనే పదవికి ఎంత గౌరవం వచ్చిందంటే, సీఎం పదవి కాకుండా, డిప్యూటీ సీఎం పదవిని మంత్రి నారా లోకేష్ కోరుకునేంతలా.!
నారా లోకేష్ ఆ పదవిని కోరుకుంటున్నారా.? లేదంటే, టీడీపీ నాయకులే నారా లోకేష్‌ని డిప్యూటీ సీఎం పదవిలో కూర్చోబెట్టాలనుకుంటున్నారా.? అన్నది మళ్ళీ వేరే చర్చ.
ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పదవీ బాధ్యతలు స్వీకరించింది మొదలు, దేశవ్యాప్తంగా ‘డిప్యూటీ సీఎం’ అనే పేరు మార్మోగిపోతోంది. ఎక్కడ విన్నా ఇదే హాట్ టాపిక్.
ఔను, సీఎం పోస్ట్ కంటే డిప్యూటీ సీఎం పోస్ట్ పవర్ ఫుల్.. అని ఇప్పుడంతా ఒప్పుకుని తీరాల్సిందే. దటీజ్ పవన్ కళ్యాణ్.!