రాధికా ఆప్టే.! ఆమె ఏం చేసినా సంచలనమే.!

 రాధికా ఆప్టే.! ఆమె ఏం చేసినా సంచలనమే.!

Radhika Apte

Radhika Apte Mom Pump.. వివాదాలనండీ.. సంచలనాలనండీ.. రాధికా ఆప్టే అంటేనే అంత.! ఆమె ఏం మాట్లాడినా అది సంచలనమే. ఆమె ఏం చేసినా అది సంచలనమే.!

కొద్ది రోజుల క్రితమే రాధికా ఆప్టే నటించిన ఓ సినిమాకి సంబంధించి ఓ వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. అందులో ఆమె నగ్నంగా కనిపించడమే అందుక్కారణం.

నిజానికి, ఇదేమీ కొత్త కాదు రాధికా ఆప్టేకి. ఆమె బోల్డ్ అండ్ స్ట్రాంగ్.! ‘ఔను, నేను అందులో నటించా..’ అని ధైర్యంగా చెప్పగల సత్తా వుందామెకి.

అసలు విషయానికొస్తే, రాధికా ఆప్టే ఇటీవల తల్లి అయ్యింది. తాజాగా, ఆమె ఓ ఈవెంట్‌లో పాల్గొంది. తల్లయిన కొద్ది రోజులకే ఆమె ఓ ఈవెంట్‌లో పాల్గొనడం గమనార్హం.

Radhika Apte Mom Pump.. రాధిక అంటే సమ్‌థింగ్ వెరీ స్పెషల్..

అక్కడితో ఆగితే, ఆమె ‘వెరీ వెరీ స్పెషల్’ ఎందుకవుతుంది.? ఓ చేత్తో షాంపేన్ గ్లాస్ పట్టుకుని వున్న ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది రాధిక ఆప్టే.

షాంపేన్ గ్లాస్‌లో వింతేముంది.? అందులో వింత లేదు, మరో చేతిలో వుంది.! ఆ మరో చేతిలో వున్నది బ్రెస్ట్ పంప్.! బ్రెస్ట్ నుంచి మిల్క్ పంప్ చేసేందుకు వినియోగించే పరికరం అది.

తల్లయిన కొద్ది రోజులకే ఈవెంట్‌లో పాల్గొనాల్సి వచ్చింది. తల్లిగా నాకుండే ఇబ్బందుల్ని గుర్తించి, ప్రత్యేక ఏర్పాట్లు చేయడం మంచి విషయం.. అంటూ, తనను ఆ ఈవెంట్‌కి పిలిచిన స్నేహితురాలి గురించి చెప్పుకొచ్చింది రాధికా ఆప్టే సోషల్ మీడియా వేదికగా.

Also Read: రెజీనా కసాండ్రా.! పేరు వెనక సీక్రెట్ తెలుసా.?

తరచూ బాత్రూమ్‌కి వెళ్ళేందుకు ఆమె సహకరించిందట రాధికా ఆప్టేకి. బాత్రూమ్‌కి వెళ్ళి బ్రెస్ట్ పంప్ ద్వారా, బ్రెస్ట్ మిల్క్‌ని బయటకు తీసిందన్నమాట రాధికా ఆప్టే.

ఛీ.. అని ఎవరైనా అనుకోవచ్చుగాక.! కానీ, ప్రతి తల్లికీ మాతృత్వం తర్వాత ఎదురయ్యే పరిస్థితే ఇది.! ఇప్పుడైతే బ్రెస్ట్ పంప్స్ అందుబాటులోకి వచ్చాయ్.

లేదంటే, మాతృత్వం తర్వాత కొద్ది రోజులపాటు, నెలలపాటు మహిళలు వెళ్ళడం కొంత ఇబ్బందికరమే. బ్రెస్ట్ మిల్క్ పంప్స్ పట్ల అవగాహన కోసం.. రాధికా ఆప్టే ఇదంతా చేసిందని అనుకోవచ్చు.

ఆ కోణంలో చూస్తే, రాధిక ప్రయత్నాన్ని అభినందించి తీరాల్సిందే.

Digiqole Ad

Related post