Home » ‘నీ గొట్టం’ కక్కుర్తి.! మెదళ్ళలో పేరుకుపోతున్న విషం.!

‘నీ గొట్టం’ కక్కుర్తి.! మెదళ్ళలో పేరుకుపోతున్న విషం.!

by hellomudra
0 comments
Thotapalli Madhu

Devi Prasad Thotapalli Madhu.. యూ ట్యూబ్ ఛానళ్ళ ఇంటర్వ్యూలనగానే, మెదళ్ళలో విషం నింపేసుకుని వెళ్ళాలేమో.! అలాగే వుంది వ్యవహారం.!

ఆడెవడో, కుర్చీని మడతబెట్టి.. అనే బూతు మాట మాట్లాడితే, అది వైరల్ అయితే.. మాట్లాడింది, ఓ అడుక్కుతినేవాడన్న సంస్కారం కూడా లేకుండాపోయింది కొందరు సినీ ప్రముఖులకి.

అదో ట్రెండింగ్ పాట అయి కూర్చుంది.. కుర్చీ మడత బెట్టి.. అని.! యూ ట్యూబ్ ఇంటర్వ్యూలంటేనే అంత.

పనికిమాలినోడు.. ప్రముఖుడు.. పెద్దగా తేడాల్లేవ్.! ఎవడెంత ఛండాలంగా మాట్లాడితే, కంటెంట్ అంత వైరల్ అవుతోంది.

ఈ క్రమంలోనే ప్రముఖులనదగ్గవారు, మురికి కూపంలోకి జారిపోయి మరీ, నోటి దూల చూపిస్తున్నారు. ప్రశ్నలు అడిగే జర్నలిస్టులు.. ఎర్నలిస్టులుగా మారిపోయి.. మరింతగా దిగజారిపోతున్నారు.

అలాంటి ఓ దిక్కుమాలిన ఇంటర్వ్యూ గురించి దర్శకుడు, నటుడు, దేవీప్రసాద్ ఆవేదన ఇదిగో ఇలా వుంది.! నీ గొట్టం.. అర్జంటుగా దీనిపై బ్యాన్ విధించాలా? పరిశ్రమ పరువు ప్రతిష్టల్ని మంటగలుపుతున్న సోకాల్డ్ మెదడులో విషం నింపేసుకున్న వెధవల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే.!

Devi Prasad Thotapalli Madhu.. దేవీ ప్రసాద్ సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేసిన ఆవేదన.. యధాతథంగా.!

ఎంత గొప్ప సినిమా అయినా కాగితంపైన రాసే అక్షరంతోనే ప్రారంభం అవుతుంది. అందుకే రచయితదెప్పటికీ అగ్రస్థానమే అని నమ్ముతాను. నా వరకూ నేను రచయిత స్థాయి, వయసుతో నిమిత్తం లేకుండా ఎప్పుడూ గౌరవిస్తాను. అందరూ గౌరవించాలని కోరుకుంటాను.

ఇదిగో ఈ ఫోటోలో వున్న సీనియర్ రచయిత తోటపల్లి మధు గారి వంటివారు మాత్రం కొంత ప్రత్యేకం.

వీరికి కొన్ని ప్రత్యేక ప్రతిభలున్నాయి.

మీడియా మైక్ పెట్టి కెమెరా ఆన్ చేస్తేచాలు…..

పరిశ్రమలో ఎంత సాధించినవారినైనా వాడు వీడు అని సంబోధించగలరు.

Devi Prasad
Devi Prasad

జంధ్యాల గారు, సావిత్రిగారు, శ్రీదేవి గారి లాంటి వారు అసలెందుకు మందుకు బానిస అయ్యారో, రోజుకి ఎన్నిసార్లు తాగేవారో కూడ కళ్ళారా చూసినట్టు చెప్పగలరు.

అసలు శ్రీదేవిగారు చనిపోయేముందు ఏమేమి ఎలా జరిగిందో అప్పుడు ఆ ప్రదేశంలో ఆయన అక్కడ వున్నట్టే వివరించగలరు.

తమిళ ఎం.జి.ఆర్ గారు స్విస్ బ్యాంక్ లో దాచిన 3000 వేల కోట్ల సొమ్ము వివరాల చీటీని ఆయన తన తలపైన టోపీలో దాచుకుంటే జయలలితగారు దాన్ని తీసి శోభన్‌బాబుగారికిస్తే ఆయన భూములుకొని ఎలా లాభపడ్డారో ప్రత్యక్షసాక్షిలా చెప్పగలరు.

అద్భుతమైన నటనను కూడా ప్రదర్శించే వీరి దృష్టిలో జస్ట్ వందల సినిమాలలో మాత్రమే నటించి నంది అవార్డులుకూడా పొందిన సీనియర్ నటులు మురళీమోహన్ గారు అసలు ఆర్టిస్టే కాదని బల్లలు బద్దలు కొట్టగలరు.

మరణించిన మిక్కిలినేని గారివంటి నటులను అపహాస్యం చేయటమే కాక వీరికి అవకాశాలిచ్చి ఉపాధి కల్పించిన కోదండరామిరెడ్డి గారిలాంటి వారి ప్రతిభకూ వ్యంగ్యంగా మరకలద్దగలరు.

పాపం అస్సలు మందు వాసనంటే తెలియని వీరు ఇప్పుడు ఇండస్ట్రీలో మందుని దాటి అందరూ డ్రగ్స్ విరివిగా వాడుతున్నారనీ,అవికూడా డాక్టర్లే ఇస్తారనీ చూసినట్లే చెప్పి అన్నం పెడుతున్న ఇండస్ట్రీనే ఎంతవరకైనా దిగజార్చగలరు.

వారికి అవకాశాలిచ్చి ప్రోత్సహించిన మా గురువుగారు ఈ లోకంలో లేని”కోడిరామకృష్ణ” గారి మీద అబధ్ధాల అవాకులు చెవాకులు పేలగలరు.

కానీ వారికి తెలియనిదొక్కటే. మా గురువుగారు లేకపోయినా ఆయన శిష్యులం మేమింకా ఇక్కడే వున్నాం.

తోటపల్లి మధు గారిలో పశ్చాత్తాపం రాకుంటే వారికున్నంత కుసంస్కార ప్రతిభ మాకు లేకున్నా వారి అసహ్యకర జుగుప్సాకర లీలలు విన్యాసాలు అప్పటివి ఇప్పటివి మాకు పరిపూర్ణంగా తెలుసు కనుక వాటిని విశదపరచి మేమూ మన్ననలందుకోక తప్పేట్టులేదు.

(వారి అబధ్ధపు ఘోష మధ్యలో పట్టరాని నవ్వులతో అలరించిన యాంకర్ స్వప్న గారి సంస్కారం కూడా తక్కువేమీ కాదు.)

– దేవి ప్రసాద్

You may also like

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group