Devi Sri Prasad.. ఎనకటికి ఎవడో ఒంటి మీద నూలు పోగు లేకుండా తిరుగుతూ తాను దేవతా వస్ర్తాలు ధరించాననీ, మామూలు మనుషులకి అవి కనిపించవనీ అన్నాడట. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఘాటైన ఐటెం సాంగ్స్‌ని భక్తి గీతాలతో పోల్చడం అలాగే ఉంది మరి.
తన సినిమా ప్రమోషన్ల కోసం దేవిశ్రీ ప్రసాద్ ఏవైనా మాట్లాడుకోవచ్చు.. ఎన్ని కథలైనా చెప్పుకోవచ్చు. సినిమా అంటేనే మార్కెటింగ్. కమర్షియల్ సినిమా కోసం ఎన్ని వెర్రి మొర్రి వేషాలైనా వేసేయొచ్చు. ఇది తప్పు.. ఇది ఒప్పు అనడానికి వీల్లేదు. అలాగని రక్తి పాటను భక్తి పాటగా అభివర్ణిస్తే ఎలా.?
Devi Sri Prasad, ఇదేందయ్యో.!
తాను ట్యూన్ కట్టిన ఐటెం సాంగుని ఎవరో భక్తి గీతంగా లిరిక్స్ మార్చి పాడినంత మాత్రానా ప్రతీ ఐటెం సాంగూ భక్తి గీతమైపోతుందా.? ‘ఊ అంటావా.. ఊఊ అంటావా..’ పాట తాలూకు పైత్య రసానికి భక్తి రసాన్ని అద్దితే అంతకన్నా దుర్మార్గం ఇంకేమీ ఉండదు.

పది కాలాల పాటు పాట వినిపిస్తే, అది సూపర్ హిట్టు పాటవుతుందేమో కానీ, బూతు గీతం ఎప్పటికీ భక్తి గీతం కాలేదు. ఎందుకంటే, దేవిశ్రీ ప్రసాద్ కంటే ముందు, ఎందరో ఐటెం సాంగ్స్ చేశారు. చేస్తున్నారు. ఇకపైనా చేస్తూనే ఉంటారు.
భక్తి.. రక్తి.. విరక్తి.!
కానీ, దేవిశ్రీ ప్రసాద్‌కి మాత్రమే అవి భక్తి గీతాల్లా అనిపిస్తున్నాయంటే, ఆయన ఆలోచనా ధోరణి ఏంటో అర్ధం చేసుకోవచ్చు.
తాను స్వర పరిచిన పాటను దేవిశ్రీ ప్రసాద్ ప్రేమిస్తుండొచ్చుగాక. సంగీతం పట్ల బోలెడంత ప్రేమాభిమానాలు, భక్తి భావం ఉంటే ఉండొచ్చుగాక.. దర్శకుడు చెప్పే సన్నివేశాన్ని బట్టి స్వర కల్పన చేయడంలో ధిట్ట అయితే అవ్వచ్చు గాక. కానీ, భక్తి పాట వేరు. రక్తి పాట వేరు.
Also Read: జాతిపుష్పం: ఊ అంటావా మావా.. ఊహూ అంటావా.!
కెవ్వుకేక.. రింగ రింగా.. ఇలా ప్రతి పాటకీ బలవంతంగా భక్తి ముసుగు తగిలించేయగలననే భ్రమలో దేవిశ్రీ ప్రసాద్ ఉంటే, ఆయన అజ్ఞానానికి చింతించడం తప్ప ఏం చేయగలం. మహా అయితే, మంచి బుద్ధిని ప్రసాదించమని దేవున్ని కోరగలం. రింగ, రింగా స్టైల్‌లో కాదు సుమీ.!