Dhanush Nayanthara Documentary.. పది కోట్ల రూపాయలు.. అటు నయనతారకీ ఎక్కువ కాదు.. ఇటు ధనుష్‌కీ ఎక్కువ కాదు.!
ఓ సినిమాకి సైన్ చేస్తే నయనతార అందుకునే రెమ్యునరేషన్ ఎంత.? అన్నది అందరికీ తెలిసిన విషయమే.
లేడీ సూపర్ స్టార్ నయనతార, రెమ్యునరేషన్ విషయంలో చాలా స్ట్రిక్టు.! ముక్కు పిండి మరీ వసూలు చేస్తుంది. అది తప్పు కూడా కాదు.!
తండ్రి, సోదరుడు సినీ రంగం నుంచే వచ్చారంటూ పరోక్షంగా ‘నెపోటిజం’ ప్రస్తావనకు తెచ్చి, దనుష్‌ని తూలనాడింది నయనతార.! అసలిక్కడ ఆ ప్రస్తావన ఎందుకు.?
Mudra369
ఇక, దనుష్ సంగతి సరే సరి.! ధనుష్ ఏదన్నా సినిమాకి సైన్ చేస్తే, రికార్డు స్థాయి రెమ్యునరేషన్ అందుకుంటాడు. ఆయన కేవలం నటుడే కాదు, దర్శకుడు, నిర్మాత కూడా.
పాటలు పాడతాడు, కొరియోగ్రఫీ చేస్తాడు.. ఇంకా చాలా చాలా చేస్తాడు ధనుష్. నయనతార భర్త విఘ్నేష్ శివన్ కూడా దర్శకుడే. నయన – విఘ్నేష్ కలిసి సినిమాల నిర్మాణం కూడా షురూ చేశారు.
Dhanush Nayanthara Documentary.. అసలెందుకీ పంచాయితీ.?
ఇప్పుడిదంతా ఎందుకంటే, ధనుష్ నిర్మాతగా నయనతార – విజయ్ సేతుపతి జంటగా తెరకెక్కిన ‘నేనూ రౌడీనే’ సినిమాలోని మూడు సెకెండ్ల క్లిప్ ఖరీదు పది కోట్లు అయ్యింది కాబట్టి.
ఆ పది కోట్లు, నయనతార మీద డాక్యుమెంటరీ తీసినవాళ్ళు చెల్లించాలన్నది నిర్మాత ధనుష్ కండిషన్ అట. అలాగని నయనతార చెబుతోంది.

నెట్‌ఫ్లిక్స్ వేదికగా నయనతార డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ కావాల్సి వుండగా, ‘ఎన్‌వోసీ’ (అనగా నో అబ్జక్షన్ సర్టిఫికెట్) కోసం నయనతార రెండు మూడేళ్ళుగా ధనుష్ చుట్టూ తిరుగుతోందిట.
ఈ విషయమై ఇంతవరకు ధనుష్ స్పందించలేదు. అసలేం జరిగిందన్నదానిపై ధనుష్ స్పందించాల్సి వుంది. నయనతార చెప్పింది ‘వన్ సైడ్’ గనుక, అప్పుడే నమ్మేయలేం.
పది కోట్లు.. ఎవరికెక్కువ.?
కాకపోతే, పది కోట్లు నయనతారకి ఎక్కువ కాదు.. నెట్‌ఫ్లిక్స్ సంస్థకీ ఎక్కువ కాదు.! అదే సమయంలో, ధనుష్ కూడా అలాంటి మనిషి కాదు.

‘నేనూ రౌడీనే’ సినిమా విషయమై నయనతార, ఆ చిత్ర నిర్మాత ధనుష్‌ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించేసిందన్నది అప్పట్లో వినిపించిన రూమర్.
Also Read: కట్టుకున్న భార్యని రోడ్డు మీదకు లాగేసిన ‘పాండిత్యం’.!
ఆ విషయమై తరచూ ధనుష్, పరోక్షంగా కామెంట్లు చేస్తుంటాడుగానీ, నేరుగా నయనతార పేరు చెప్పి విమర్శించింది లేదు. ఇప్పుడు సమయం వచ్చింది గనుక, రివెంజ్ తీర్చుకుంటున్నాడేమో.!
‘క్యారెక్టర్‌లెస్ నయనతార’ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవుతోందంటే.. విషయం కాస్త అర్థం చేసుకోవాల్సిందే.