Dhanush Sir Preview.. ధనుష్, సంయుక్త మీనన్ కాంబినేషన్‌లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సార్’ ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యింది.
‘సార్’ సినిమా రేపు విడుదల కావాల్సి వుండగా, కాస్త ఆశ్చర్యకరంగా ఈరోజు రాత్రి నుంచే ప్రీమియర్స్ పడిపోతున్నాయి. పరిస్థితి చూస్తోంటే, రిలీజ్ డేట్ ముందుకొచ్చిందా.? అన్న అనుమానం కలుగుతోంది చాలామందికి.
సాధారణంగా టాలీవుడ్ స్టార్స్ సినిమాలకే ప్రీమియర్స్ పడుతుంటాయి. అది కూడా అర్థరాత్రి దాటాక. కానీ, సెకెండ్ షోలను ‘సార్’ కోసం ప్రీమియర్లుగా మలిచేస్తున్నారు.
అతి విశ్వాసమా.? ఆత్మ విశ్వాసమా.?
నిజానికి, ‘సార్’ (Sir Movie) అనేది తెలుగు టైటిల్. ఇది తమిళ సినిమా ‘వాతి’. దానికి తెలుగు డబ్బింగ్ వెర్షన్ ‘సార్’.
‘భీమ్లానాయక్’, ‘బింబిసార’ చిత్రాల ఫేం సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్ కావడం ఒకింత ఈ సినిమాపై ఓ సెక్షన్ ఆడియన్స్‌లో స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది.
అన్నిటికీ మించి, ధనుష్‌కి తెలుగునాట కూడా డై హార్డ్ ఫ్యాన్స్ వున్నారు. ఈసారి ఆ అభిమానులు కాస్త గట్టిగానే యాక్టివ్ అయినట్లు కనిపిస్తోంది.
‘సితార’ బ్యానర్ చేస్తున్న ప్రమోషన్లు, ఈ సినిమా ప్రమోషన్ కోసం ధనుష్ హైద్రాబాద్ వచ్చి, తెలుగు ఆడియన్స్‌ని ఆకట్టుకునేందుకు తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేయడం.. ఇవన్నీ ‘సార్’ సినిమాకి కాస్త పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యేలా చేశాయి.
Dhanush Sir Preview.. ‘విద్య’ చుట్టూ..
నేటి విద్యా వ్యవస్థ ఎంత అధ్వాన్నంగా తయారైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కార్పొరేట్ విద్యా సంస్థలు ‘విద్య’ని ఎలా క్యాష్ చేసుకుంటున్నాయన్నదాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు.
ఓ చక్కని సందేశం.. అదీ ఎంటర్టైనింగ్ వేలో చెప్పారని ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో సినిమాపై బజ్ మరింత పెరిగింది. సక్సెస్‌కి పొంగిపోవడం.. ఫెయిల్యూర్‌కి కుంగిపోవడం తెలియని ‘సినీ కర్మయోగి’గా ధనుష్‌ని త్రివిక్రమ్ అభివర్ణించారు.
Also Read: Nidhhi Agerwal: ఇస్మార్ట్ బ్యూటీ.. ఓ స్వచ్ఛమైన ప్రేమికుడు.?
మిగతా విషయాల్ని పక్కన పెడితే, సినిమాపై మేకర్స్‌లో వున్నది నమ్మకమే అనిపిస్తున్నా.. ఓ తమిళ హీరో సినిమాకి ముందే ప్రీమియర్లు వేసెయ్యడం మాత్రం అతి విశ్వాసంగానే కనిపిస్తోందన్నది కొందరి మాట.
ఇంతకీ ఇది అతి విశ్వాసమా.? ఆత్మ విశ్వాసమా.? కాస్సేపట్లో తేలిపోతుంది.