మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘ఆచార్య’. ‘ధర్మస్థలి’ (Dharmasthali In Mega Star Chiranjeevi Acharya) అంటూ ఈ సినిమా గురించి బీభత్సమైన ప్రచారం నడుస్తోంది. అసలు ఏంటీ ధర్మస్థలి.? దేవుడు, దేవుడ్ని ఆరాధించేవాళ్ళు.. వారికి కష్టమొస్తే, దేవుడే అవసరం లేదు.. ఎవరైనా ఆదుకోవడానికి రావొచ్చు.. అంటూ ఓ డైలాగు.. వెరసి, ‘ఆచార్య’ అందర్నీ ఆలోచనలో పడేసింది.
కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా వేసవి కానుకగా మే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్ తాజాగా వదిలారు. మైండ్ బ్లోయింగ్.. అన్నది చాలా చాలా చిన్న మాట. మెగాస్టార్ అలా తెరపై కన్పించగానే.. కాదు కాదు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) వాయిస్ ఓవర్ వినిపించగానే, అందరికీ గూస్‌బంప్స్ వచ్చేశాయి.
మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సత్తా అలాంటిది మరి. విజువల్స్ అదిరిపోయాయ్. ఫ్రేమింగ్ సింప్లీ సూపర్బ్. ఎలా చూసినా, ఇదొక మాస్టర్ పీస్ అవడం పక్కా.. అన్న భావన అందరిలోనూ కలిగింది. ‘పాఠాలు చెప్పలేదుగానీ, ఆచార్య అంటున్నారంటే బహుశా గుణపాఠాలు బాగా చెబుతాననేమో..’ అంటూ చిరంజీవి చెప్పిన డైలాగ్ ఈ టీజర్‌ని ఇంకాస్త స్పెషల్‌గా మార్చేసింది.
ఎలివేషన్ సీన్స్.. షాట్ ఫ్రేమింగ్.. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్… ఇలా అన్నీ ఒకదాన్ని మించి ఇంకోటి.. అనేలా వున్నాయ్. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మ్యాటినీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలు. మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఈ ‘ఆచార్య’ (Acharya) సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ టీజర్ మొత్తానికీ మరో స్పెషల్ ఏంటంటే, మెగాస్టార్ చిరంజీవి సన్నబడ్డారు.. కుర్రాడిలా కనిపిస్తున్నారు. ఏమో, సినిమాలో ఎలా కనిపిస్తారోగానీ, టీజర్ ద్వారా అయితే మాత్రం.. తానింకా సూపర్ ఎనర్జిటిక్ అండ్ డైనమిక్ పర్సనాలిటీ.. అని చిరంజీవి నిరూపించేశారు.