Dhvani Hypersonic Missile.. శతృవుల గుండెలు బద్దలయ్యే వార్త ఇది.! భారత రక్షణ దళాల చేతికి త్వరలో సరికొత్త మిసైల్ అందనుంది.! ప్రస్తుతం ఈ మిస్సైల్ ప్రయోగ దశలో వుంది.
ప్రస్తుతం సూపర్ సోనిక్ మిస్సైల్స్ భారత అమ్ముల పొదిలో చాలానే వున్నాయ్. సూపర్ సోనిక్ మిస్సైళ్ళు, హైపర్ సోనిక్ మిస్సైళ్ళు.. రక్షణ రంగంలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తాయి.
మొన్నటికి మొన్న, ఆపరేషన్ సిందూర్‌లో బ్రహ్మోస్ క్షిపణులు ఏ స్థాయి విధ్వంసాన్ని సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా.!
పాకిస్తాన్, బ్రహ్మోస్ మిస్సైళ్ళకు తల వంచాల్సి వచ్చింది. పాకిస్తాన్ భూభాగంలో కీలకమైన ప్రాంతాల్ని బ్రహ్మోస్ మిస్సైళ్ళు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.
Dhvani Hypersonic Missile.. బ్రహ్మోస్‌ని మించి.. ధ్వని.!
గంటకు సుమారు 3700 కిలోమీటర్ల వేగంతో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైళ్ళు దూసుకెళతాయి. బ్రహ్మోస్‌లోనే హైపర్ సోనిక్ మిస్సైళ్ళ తయారీకి ఆల్రెడీ శ్రీకారం చుట్టారు.
మరోపక్క, ‘ధ్వని’ పేరుతో హైపర్ సోనిక్ మిస్సైల్ ప్రయోగానికి రంగం సిద్ధమైంది. ఈ ఏడాది చివర్లో ఈ మిస్సైల్‌ని ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు.
పలు దఫాల ప్రయోగాత్మక పరీక్షల అనంతరం, ఈ ‘ధ్వని’ హైపర్ సోనిక్ మిస్సైల్‌ని సైన్యానికి అందించడం జరుగుతుంది.
Also Read: బిగ్ బాస్ ఇంట్లో ‘ఫుడ్డు’ కోసం కొట్టుకు ఛస్తారెందుకు.?
నీటి మీద నుంచీ, నేల మీద నుంచీ, ఆకాశం నుంచి ప్రయోగించే విధంగా ఇప్పటికే బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైళ్లను తయారు చేసి, త్రివిధ దళాలకు అప్పగించడం జరిగింది.
‘ధ్వని’ హైపర్ మిస్సైల్ కూడా, భూమ్మీద నుంచీ అలాగే నీటి మీద యుద్ధ నౌకల నుంచీ.. ఆకాశంలో యుద్ధ విమానాల నుంచీ ప్రయోగించేలా తీర్చిదిద్దనున్నారు.

‘మాక్-5’ వేగంతో, అంటే సుమారుగా గంటకి 7400 కిలోమీటర్ల వేగంతో ఈ ‘ధ్వని’ హైపర్ సోనిక్ మిస్సైల్ దూసుకుపోతుంది.
భారత్ – రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ‘బ్రహ్మోస్’ క్షిపణి, అంతర్జాతీయ స్థాయిలో అత్యద్భుతమైన మిస్సైల్‌గా పేరొందిన సంగతి తెలిసిందే.
ఇప్పుడీ ‘ధ్వని’ హైపర్ సోనిక్ మిస్సైల్‌తో, భారత రక్షణ రంగ ఖ్యాతి మరింతగా పెరగనుంది. డీఆర్‌డీవో ఈ మిస్సైల్‌ని అభివృద్ధి చేస్తోంది.
