Dies Irae Telugu Review.. దెయ్యాల సినిమాలు బోల్డన్ని చూశాం. ఇక ముందూ చూడబోతున్నాం.! దెయ్యాల సినిమాలకి వున్న క్రేజ్ అలాంటిది.!
కేవలం హర్రర్ నేపథ్యంలోనే కొన్ని సినిమాలుంటాయ్. హర్రర్‌కి కామెడీ జోడిస్తే, అది కమర్షియల్ సక్సెస్ ఫార్ములా.!
సీరియస్ అయినా, కామెడీ అయినా.. దెయ్యం అంటేనే, బాక్సాఫీస్ వసూళ్ళ పంట పండించే ఓ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్.!
తెలుగు, తమిళ, హిందీ.. ఇలా ఏ సినీ పరిశ్రమలో అయినా.. దెయ్యాల సినిమాలకు అందుకే అంత క్రేజ్.!
ఇక్కడ, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ‘Dies Irae’ అనే సినిమా గురించి. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ తనయుడు ప్రణవ్ నటించిన సినిమా ఇది.!
ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.. దాంతో, మనకు తెలిసిన మోహన్‌లాల్ కుమారుడే కదా.. అని, చాలామంది ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం షురూ అయ్యింది.
దెయ్యాల సినిమాలంటే, బొత్తగా ఇష్టం వుండదుగానీ.. మోహన్‌లాల్ కొడుకు సినిమా.. అన్న యాంగిల్‌లోనే, ఈ ‘Dies Irae’ సినిమాని కాస్త తీరిక చూసుకుని మరీ, ఓటీటీలో చూడ్డం జరిగింది.
ఇంతకీ, ఈ సినిమాలో అసలు ఏముంది.? ఎవరు దెయ్యం.? ఏంటా కథ.? అంటే, ఓ ఇంట్లో దెయ్యం వుంటుంది. ఆ దెయ్యాన్ని హీరో ఎలా ఎదుర్కొన్నాడన్నదన్నదే అసలు కథ.
ఎదుర్కోవడమూ లేదు.. పాడూ లేదు.. ఆ దెయ్యాన్ని ఆ ఇంట్లోంచి తరిమేస్తాడంతే. ఈలోగా, కొంత గాయపడతాడు కూడా హీరో.!
దెయ్యం ఎవరన్న సస్పెన్స్ చివర్లో రివీల్ అవుతుంది. కాకపోతే, ఓ పెద్దావిడతో హీరోగారికి ఓ యాక్షన్ బ్లాక్ ఒకటి వుంటుంది. అదే, కొంచెం అన్ యూజువల్‌గా అనిపిస్తుంది.
మరీ అంత హింస అవసరమా.? అన్న ప్రశ్న తలెత్తుతుందిగానీ.. ఈ తరహా సినిమాల్లో ఇలాంటివి మామూలే.!
టెక్నికల్‌గా సినిమా బావుంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. అన్నీ బావున్నాయి. కాకపోతే, ఒక్కో సీన్.. చాలా సేపు సాగదీశారు. అదే, పెద్ద మైనస్.
సగం రన్ టైమ్ తగ్గించేస్తే, సినిమాకి వేరే లెవల్ పాజిటివ్ అప్లాజ్ వచ్చి వుండేదేమో.! కంప్లీట్ సైలెన్స్, అంతలోనే భయంకరమైన సౌండ్.. ఇది సగటు దెయ్యాల సినిమా తీరు.
ఈ సినిమా కూడా అంతే.! నటుడిగా ప్రణవ్ ఓకే.! బానే చేశాడు. మిగతా పాత్రధారుల్లో ఎవరూ మన తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న ముఖాలు కానే కావు.!
దెయ్యాల సినిమాల్ని.. అందునీ, సీరియస్ హర్రర్ మూవీస్ చూడటానికి ఇష్టపడేవాళ్ళు ఓ ట్రై ఇవ్వొచ్చు. కామెడీని ఆశిస్తే మాత్రం భంగ పడతారు.
ఇంకెలాంటి, ఇతరత్రా గ్లామరస్ అంశాలకీ ఈ సినిమాలో పెద్దగా తావివ్వలేదు.! ఈ తరహా కథలు బోల్డన్ని వచ్చేశాయ్ కదా.. అంటే, నిర్మొహమాటంగా స్కిప్ కొట్టెయ్యండి.
అన్నట్టు సినిమాకి కొనసాగింపు కూడా వుండేందుకు వీలుగా, క్లయిమాక్స్‌లో ఓ చిన్న లీడ్ వదిలారండోయ్.!
