Deepika Padukone Kalki Event.. అసలు అలాంటి డ్రెస్ దీపికా పదుకొనె ఎందుకు వేసుకుంది.? పెన్సిల్ హీల్ వేసుకుని రావడమేంటి.? అసలామె, ఈ ఫంక్షన్‌కి అటెండ్ అవడమేంటి.?
‘కల్కి’ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచిన బాలీవుడ్ నటి దీపికా పదుకొనే విషయమై సోషల్ మీడియాలో కనిపిస్తున్న కామెంట్లు ఇవి.!
తప్పేముంది.? దీపకా పదుకొనే ప్రెగ్నెంట్ అయినంతమాత్రాన, ఇంటికే పరిమితమవ్వాలా.? నిజానికి, సినిమా ప్రమోషన్ కోసం తాను చేయగలిగిందంతా చేస్తోన్న దీపికని అభినందించాలి తప్ప, తప్పు పట్టడం సబబు కాదు.
Deepika Padukone Kalki Event.. అపురూపంగా చూసుకున్నారు..
సినిమా గురించి, ఆ సినిమాలో నటించిన నటీనటులు మంచిగా మాట్లాడటం అనేది కొత్తేమీ కాదు. దీపిక కూడా అదే చేసిందనుకోండి.. అది వేరే విషయం.!
చిత్ర యూనిట్ దీపికా పదుకొనేని చాలా అపురూపంగా చూసుకుంది నిన్నటి ఈవెంట్‌లో. సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్, ‘కల్కి’ హీరో ప్రభాస్.. ఆమెను మరింత బాగా చూసుకున్నారు.
ప్రెగ్నెంట్ కదా.. పెన్సిల్ హీల్ వేసుకుని నడిస్తే, ప్రమాదకరం కదా.? అన్న చర్చ జరుగుతున్నమాట వాస్తవం. కానీ, దీపికా పదుకొనేకి ఆ మాత్రం జాగ్రత్త లేకుండా వుంటుందా.? ‘కల్కి’ టీమ్ కూడా ఆమెను ప్రమోషనల్ ఈవెంట్ సందర్భంగా చాలా జాగ్రత్తగా చూసుకుంది.
Mudra369
ఒక్కటి మాత్రం నిజం, ‘కల్కి’ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్న దీపికా పదుకొనేని ప్రత్యేకంగా అభినందించి తీరాల్సిందే.
ఇంతకు ముందెవరూ ఇలా చేయలేదా.? అంటే, చేశారు.! వాళ్ళనీ, ఆయా సందర్భాల్లో అభినందించినవాళ్ళున్నారు.

ట్రోలింగ్ విషయానికొస్తే, పనీ పాటా లేనోళ్ళు చేసే ట్రోలింగ్‌ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నది, ఆయా సందర్భాల్లో ఆయా సినీ ప్రముఖులు చెప్పినమాట.
బహుశా ప్రస్తుతం జరుగుతున్న ట్రోలింగ్ విషయమై దీపిక కూడా అలాగే అనుకుంటోందేమో.!