Dirty Media Against Chiranjeevi.. మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే కొందరు మీడియా ప్రతినిథుల్ని ప్రత్యేకంగా ఇంటికి పిలిచారు. వారితో ముచ్చటించారు.!
‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా సంచలన విజయం సాధించిన నేపథ్యంలో, మీడియా ప్రతినిథులతో చిరంజీవి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఇంటికి పిలిపించుకున్నారు.. స్నాక్స్ ఏర్పాటు చేశారు. చాలా విషయాల్ని మీడియా ప్రతినిథులతో చిరంజీవి పంచుకున్నారు.
చిరంజీవి ఎంత గొప్పోడో తెలుసా.? అంటూ, సదరు మీడియా ప్రతినిథులు సోషల్ మీడియా వేదికగా, చిరంజీవితో తాము కలిసి దిగిన ఫొటోల్ని షేర్ చేస్తూ.. ట్వీట్లు వేశారు.
అయితే, చిరంజీవి పట్ల నరనరానా ద్వేషం నింపుకున్న కొందరు మీడియా ప్రతినిథులు షరామామూలుగానే తమ ‘కుక్క తోక వంకర’ బుద్ధిని ప్రదర్శించడానికి పెద్దగా టైమ్ తీసుకోలేదు.
పర్సనల్ విషయాల్ని చిరంజీవి, మీడియా ప్రతినిథులతో షేర్ చేసుకున్నారు. అంటే, మనసులో వున్న కొన్ని ఆలోచనలని అర్థం.
వాటి గురించి, అధికారిక ప్రకటన తానే స్వయంగా చేస్తాననీ, వాటి గురించి ఎక్కడా ప్రస్తావించొద్దని కూడా చిరంజీవి సదరు మీడియా ప్రతినిథులకు సూచించారు.
అయితే, సంచలనం కోసం.. ఆయా విషయాల్ని కొందరు మీడియా ప్రతినిథులు వార్తలుగా మార్చేశారు.. తమ కుక్క బుద్ధిని చాటేసుకున్నారు.
సర్లే.. ఇది కక్కుర్తి మీడియా యుగం కదా.. అని బహుశా చిరంజీవి కూడా లైట్ తీసుకుని వుండొచ్చు. అది వేరే విషయం.
ఇంతలోనే, మెగాస్టార్ చిరంజీవి ఇంకోసారి తాతయ్యారు. చిరంజీవి కోడలు ఉపాసన, కొడుకు రామ్ చరణ్ మరోమారు తల్లిదండ్రులయ్యారు.
చరణ్, ఉపాసన దంపతులకు కవలలు జన్మించారు. ఒకరు బాబు కాగా, మరొకరు పాప. డెలివరీ డేట్ విషయమై ముందే సమాచారం అందుకున్నారు కొందరు మీడియా ప్రతినిథులు.
ముందే చెప్పుకున్నాం కదా.. కక్కుర్తి బ్యాచ్ అని.. ఆ కక్కుర్తితో విషయాన్ని లీక్ చేశారు టైమ్‌తో సహా. అభిమానులేమో, ఆసుపత్రి దగ్గర హడావిడి చేశారు.
సరే, అభిమానులు ఆసుపత్రి వద్ద బాణా సంచా కాల్చడం అత్యుత్సాహమే. కుమార్తెతో కలిసి ఆసుపత్రికి వెళ్ళిన చరణ్, అభిమానుల అత్యుత్సాహంతో ఇబ్బంది పడ్డారు.
అయితే, దీన్ని ‘కావాలని చిరంజీవి కుటుంబమే ఈ హంగామాకి ప్లాన్ చేసింది’ అంటూ, దిక్కుమాలిన విశ్లేషణలు తమ తమ మీడియా సంస్థల ద్వారా జనాల్లోకి తీసుకెళ్ళారు కొందరు.
ఇంతకన్నా నీఛమైన విశ్లేషణ ఇంకేమన్నా వుంటుందా.? తిన్నింటి వాసాలు లెక్కబెట్టడం.. అని దీన్నే కదా అంటారు.?
ఏం చేస్తాం.. ఇది పాత్రికేయ వ్యభిచారం వెర్రి తలలు వేస్తున్న జమానా.! సిగ్గూ ఎగ్గూ వదిలేసింది మీడియా. దిగజారిపోవడంలో కొత్త లోతుల్ని వెతుక్కుంటున్నారు మీడియా ప్రతినిథులు.
మీడియా సంస్థలు కుట్ర పూరిత ఆలోచనలతో జర్నలిజాన్ని భ్రష్టు పట్టించేశాయి. కుల జాడ్యంతో రెండు ప్రధాన రాజకీయ పార్టీలకు వంత పాడే కుల మీడియా సంస్థల పైత్యమిది.
నలుగురూ నవ్విపోదురుగాక.. వాళ్ళకేటి సిగ్గు.?
ఇంతకీ, ఈ గోతికాడ నక్కల విషయంలో చిరంజీవి ఎప్పుడు జాగ్రత్త పడతారు.? ఇది సగటు చిరంజీవి అభిమాని ఆవేదన.
