Dirty Politics Against Janasenani జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చూసుకున్నారు.! చట్టాల్ని అతిక్రమించి ఒకేసారి ముగ్గుర్ని పెళ్ళి చేసుకోలేదాయన.!
వైవాహిక జీవితంలో తలెత్తిన పొరపచ్చాలు కావొచ్చు, ఇతరత్రా కారణాలు కావొచ్చు.. కారణం ఏదైతేనేం, వైవాహిక బంధాన్ని కొనసాగించలేక.. చట్టబద్ధంగా విడాకులు తీసుకున్న వైనం అది.!
విడాకులు తీసుకున్నాక, ‘మాజీ భార్య’, ‘మాజీ భర్త’ అన్న ప్రస్తావనలు కూడా ఆయా వ్యక్తుల గురించి తీసుకురాకూడదు.
ఎందుకంటే, విడాకుల అనంతరం.. వేర్వేరు దారుల్లో తమ ప్రయాణాన్ని వెతుక్కుంటుంటారు. ఆ ప్రయాణంలో వేరే వ్యక్తులతో వైవాహిక బంధాన్ని ఏర్పరచుకోవచ్చు కూడా.!
అలాంటప్పుడు, ఆ పాత విషయాల్ని కొత్తగా ప్రస్తావిస్తే, ఆయా వ్యక్తులు.. అందునా, మహిళలు ఎంతటి ఇబ్బందిని ఎదుర్కొంటారు.?
Dirty Politics Against Janasenani.. బోడి సలహాలెవడిస్తున్నాడోగానీ..
బోడి సలహాలిచ్చే ఓ రాజకీయ ప్రముఖుడు, ‘ఏం లోపం వుంది నీలో.. వరుసగా అన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నావ్.?’ అని పవన్ కళ్యాణ్ (Jana Senani Pawan Kalyan)ని ప్రశ్నించేశాడు.
వయసు పెరిగిపోతే సరిపోతుందా.? సంస్కారం వుండొద్దూ.? దిగజారిపోవడంలో ఆ బోడి సలహా ప్రభుద్ధుడికి సాటి ఇంకెవరూ రారేమో.
Also Read: ప్రకాష్ రాజ్‌కి ఝలక్ ఇచ్చిన కంగనా రనౌత్.!
పవన్ కళ్యాణ్‌లో లోపం వుందా.? లేదా.? అన్నదాని గురించి ప్రస్తావించే నైతిక హక్కు ఈ బోడి సలహాగాడికి ఎక్కడుంది.? అన్న చర్చ సహజంగానే తెరపైకొస్తుంది. అంతే కదా మరి.!
ఇంతకీ, నీ ఇంట్లో.. నీ పెళ్ళాంతో బాగానే సంసారం చేస్తున్నావా.? అని ఎవరైనా ఎదురు ప్రశ్నిస్తే, ఆ బోడిగాడి పరిస్థితేంటి.?

ఔను, ఇది ముమ్మాటికీ పైత్యం.. కాదు కాదు, రాజకీయ వైకల్యం.! మానసిక వైకల్యం కూడా కాదు.. ఇదొక రాజకీయ రోగం.!
ఈ రోగానికి చికిత్స లేదు.1 ఇలాంటి మాటలు ఇంకా ఇంకా కొనసాగిస్తే, మీ ఇంట్లో ఆడాళ్ళే.. మీ మొహాన ఉమ్మేస్తారు.. ఆ విషయం తెలుసుకోండి బోడి సలహా ప్రభుద్ధుడుగారూ.!
రంకు.. రాజకీయం.. రెండూ ఒకటి కాదు.! రాజకీయమంటే సేవ.! కానీ, రాజకీయం ముసుగులో కొందరు చేస్తున్నది రంకు.! అందుకే, అలాంటి నాయకుల నోట్లోంచి ‘రంకు’మాటలొస్తున్నాయ్.!