Divi Vadthya.. బిగ్ బాస్ ఫేం దివి వద్త్య మొన్నీమధ్యన మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘గాడ్ ఫాదర్’ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.
చాన్నాళ్ళ క్రితం బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారానే చిరంజీవి నుంచి ‘దివి’కి ‘హామీ’ దక్కింది.. ఆ హామీని చిరంజీవి నిలబెట్టుకున్నారు.
వాస్తవానికి ‘భోళా శంకర్’ సినిమాలో ‘దివి’కి అవకాశం ఇస్తామని చిరంజీవి చప్పగా, అంతకన్నా ముందే ఆమెకు మెగా సినిమాలో చాన్స్ వచ్చింది.
Divi Vadthya ఏంటి దివీ.. మరీనూ.!
సోసల్ మీడియా వేదికగా దివి హాట్ అండ్ వైల్డ్ ఫొటోలు షేర్ చేయడం కొత్తేమీ కాదు. కాకపోతే, వెబ్ సిరీస్‌లో మాత్రం ఓ అడుగు ముందుకేసి, లిప్ లాక్ సీన్స్ లాగించేసింది.

మరీ కక్కుర్తి కాకపోతే, ఆ సీన్‌లో లిప్ లాక్‌కి ఛాన్సెక్కడిది.? అని అంతా ‘ఏటీఎం’ వెబ్ సిరీస్ చూశాక మండిపడుతున్నారు.
హరీష్ శంకర్ రూపంలో ఈ వెబ్ సిరీస్ మీద పెద్ద చెయ్యే పడింది. ఓ ఎపిసోడ్ కాస్త ఎంగేజింగ్‌గా వుందంతే. మిగతా ఎపిసోడ్స్ అన్నీ చప్పగా సాగాయి.
బిగ్ బాస్ సన్నీ, సీనియర్ నటుడు సుబ్బరాజు ఈ వెబ్ సిరీస్‌లో ఇతర ప్రధాన తారాగణం.
దివి.. అంతకు ముందు కూడా..
గతంలో కూడా దివి ఓ వెబ్ సిరీస్ చేసింది. ‘మా నీళ్ళ ట్యాంక్’ పేరుతో రూపొందింది ఆ వెబ్ సిరీస్. సుశాంత్, ప్రియా ఆనంద్ అందులో ప్రధాన తారాగణ.
Also Read: Rashmika Mandanna మహా ముదురు.! ఇదిగో ఇదే సాక్ష్యం.!
‘మా నీళ్ళ ట్యాంక్’లోనూ దివికి పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రే.! ఈసారి మాత్రం లిక్ లాక్ సీన్‌తో దివి హాట్ టాపిక్ అయ్యింది.. సిరీస్‌లో పెర్ఫామెన్స్ పరంగా ఆమెకు అంత సీన్ లేకపోయినా.!