Table of Contents
Ramoji Film City Ghost.. రామోజీ ఫిలిం సిటీ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిందేముంది.? నిజంగానే, అదో అద్భుతం.!
సరే, రామోజీరావు చుట్టూ అనేక వివాదాలున్నాయి. ఇప్పుడైతే ఆయన జీవించి లేరు.! ఫిలిం సిటీని దున్నేస్తాం.. అన్నారు కొందరు.!
రామోజీరావు మీద బోల్డన్ని కేసులు.. ఆ ఆరోపణలు, రాజకీయ విమర్శలు.. రాజగురువు రహస్యాలు.. ఇదంతా మళ్ళీ వేరే చర్చ.
ఫిలింసిటీలో దెయ్యాలున్నాయన్నది తాజా రచ్చ.! బాలీవుడ్ నటి కాజోల్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Ramoji Film City Ghost.. అసలంటూ దెయ్యాలు వున్నాయా.? లేవా.?
దాంతో, రామోజీ ఫిలిం సిటీలో నిజంగానే దెయ్యాలున్నాయా.? అన్న చర్చ తెరపైకొచ్చింది. అసలంటూ దెయ్యాలు వున్నాయా.? లేదా.?
సినిమాల్లో చూస్తున్నాం కదా, బోల్డన్ని దెయ్యాల్ని.! ఔను, నిజమే.. దెయ్యాలున్నాయి.. సినిమా కథల్లో. నిజ జీవితంలో, దెయ్యాల్లేవ్.. అన్నది చాలామంది చెప్పేమాట.
దేవుడు వుంటే దెయ్యం వున్నట్లే.! దేవుడు మంచి, దెయ్యం చెడు.! మంచి ఎలా వుందో, చెడు కూడా అలానే వుంటుంది. సో, దెయ్యం వున్నట్లేనని.. ఇంకొందరు ‘దెయ్యాల సిద్ధాంతం’ చెప్తారు.
ఎవరి గోల వారిదే.! కొన్నేళ్ళ క్రితం ఓ ఈవెంట్‌లో పాల్గొనేందుకు ఇద్దరు చిన్న పిల్లల్ని వెంటేసుకుని, సతీ సమేతంగా ఫిలింసిటీకి వెళ్ళడం జరిగింది.
అందమైన అద్భుతం ఫిలింసిటీ..
సాయంత్రం అయ్యింది.. రాత్రి కూడా అవుతోంది.! చీకటి పడ్డాక, విద్యుత్ దీపాల అలంకరణలో ఫిలింసిటీ మరింతగా అందంగా కనిపించింది.
కారులో ప్రయాణం.. అక్కడక్కడా ఆగి, అక్కడున్న అద్భుతాల్ని చూసుకుంటూ వెళుతున్నాం. ఫొటోలూ తీసుకుంటున్నాం మొబైల్ ఫోన్లలో.
జన సంచారం పెద్దగా లేని ప్రాంతం కదా.. రకరకాల శబ్దాలు.. పక్షుల కూతలు.. ఇవన్నీ వినిపిస్తున్నాయ్. భయం భయంగానే అనిపించినా, ఫిలింసిటీ అందాల ముందర భయం గల్లంతయ్యింది.
పిల్లలూ ఎక్కడా భయపడిన సందర్భమే లేదు. దెయ్యాలుంటాయా.? అన్న ప్రశ్నే ఉత్పన్నం కాలేదు. నిజానికి, ఇలాంటి సందర్భాల్లో మన నీడ మనల్ని భయపెడుతుంది. అలాంటిదేమీ జరగలేదక్కడ.
నిత్యం షూటింగుల సందడే సందడి..
అను నిత్యం ఫిలింసిటీలో బోల్డన్ని సినిమాల షూటింగులు జరుగుతుంటాయి. టీవీ సీరియళ్ళ సంగతి సరే సరి. టాలీవుడ్, బాలీవుడ్,
కోలీవుడ్.. ఇలా అన్ని సినీ పరిశ్రమల నుంచి నటీనటులు, సాంకేతిక నిపుణులు.. పెద్ద యెత్తున ఫిలిం సిటీకి వస్తుంటారు.
వాళ్ళకి, ఫిలింసిటీలోనే బస ఏర్పాట్లు కూడా వుంటాయి. ఇతరులకీ ఫిలింసిటీలో వున్న హోటళ్ళు, రెస్టారెంట్లు.. అత్యున్నతమైన సేవలందిస్తుంటాయి కూడా.
Also Read: క్యాన్సర్‌ని జయించిన రియల్ లేడీ సూపర్ స్టార్స్.!
ఇదేదో, ఫిలింసిటీకి అనుకూలంగా చెబుతున్నమాట కాదు. ఫిలింసిటీలో దెయ్యాలన్న ప్రచారాన్ని ఖండించేందుకు చెబుతున్నమాట.
దేవుడు మంచి అయితే, దెయ్యం చెడు.. చెడు ఆలోచనల్లోనే దెయ్యం స్వభావం వుంటుంది. అదీ అసలు సంగతి.
నటి కాజోల్ భయపడి వుండొచ్చుగాక.. అది, ఆమె వ్యక్తిగతం. ఈ విషయంలో ఆమెని తప్పు పట్టలేం. తాడుని చూసి, పాము.. అని భ్రమపడి, భయపడితే.. అది వేరే చర్చ కదా.!