బిగ్ బాస్ రాజకీయాలు గడచిన మూడు సీజన్ల నుంచీ చూస్తూనే వున్నాం. మొదటి సీజన్ అలా అలా గడిచిపోయిందిగానీ, రెండో సీజన్ నుంచీ దిక్కుమాలిన రాజకీయాలే (Divi Vadthya Vs Lasya Manjunath) నడుస్తున్నాయి హౌస్ మేట్స్ మధ్య. అదంతా నిజమేనని మనం అనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.
బయటకొచ్చాక అంతా స్నేహితుల్లానే కలిసిమెలిసి వుంటారు. కొందరు వుండకపోవచ్చు కూడా.! కానీ, ‘రియాల్టీ షో’ నడిచినన్నాళ్లూ హై ఓల్టేజ్ ‘యాక్షన్’ని ఎపిసోడ్స్‌లో చూపించేయడం మమూలే. ఇక, అసలు విషయానికొస్తే, దివి, లాస్య మధ్య ‘షటప్’ అనే సిట్యుయేషన్ వచ్చింది.
అంతా, ‘జీరో – హీరో’ టాస్క్ మహిమ. హౌస్‌లో అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారనే ఆలోచనతో, ‘జీరో – హీరో’ అనే టాస్క్ తెచ్చి, కంటెస్టెంట్స్ మధ్య ‘తగువు’ పెట్టేశారు. కంటెస్టెంట్స్ అందరూ తమ తమ అభిప్రాయాల్ని కుండబద్దలుగొట్టారు. అయితే, లాస్య మాత్రం.. అమ్మ రాజశేఖర్‌ని జీరో చేసే క్రమంలో, దివి పేరు తెచ్చింది.
పైగా, అమ్మ రాజశేఖర్ ఇమేజ్‌ని డీగ్రేడ్ చేసేలా దివి పేరు ప్రస్తావించి అసభ్యకరమైన కామెంట్ చేసింది. ఓ స్కిట్ కోసం దివి ‘పొట్టతో’ కన్పించాల్సి వస్తే, ఓ పిల్లో పెట్టారట. అది సరిపోలేదని అమ్మ రాజశేఖర్ ఇంకో పిల్లో పెట్టడం లాస్యకు అభ్యంతకరంగా అనిపించిందట. దానికి రాజశేఖర్ కూడా బాగా హర్టయ్యాడు.
ఊహించని పరిణామంతో షాక్‌కి గురైన దివి, లాస్యను కడిగి పారేసింది. ‘నన్నెందుకు మధ్యలోకి లాగావు. ఆయన్ని ఆ క్షణంక్ష నేను డైరెక్టర్‌గా, కొరియోగ్రాఫర్‌గానే భావించాను. నాకు వేరే చెడు ఆలోచన ఏమీ రాలేదు. నువ్వెందుకు నా ఇమేజ్‌నీ, రాజశేఖర్ ఇమేజ్‌ని డ్యామేజ్ చెయ్యడానికి ప్రయత్నించావు.
మా ఇంట్లోవాళ్ళు ఈ ఎపిసోడ్ చూస్తారు. వారికి ఎంత అభ్యంతకరంగా అనిపిస్తుందిది?’ అంటూ లాస్యపై మండిపడటమే కాదు, ‘షట్ అప్’ అనేసింది దివి. ‘ఆ ఆటిట్యూడ్ ఏంటి.? ఏం మాట్లాడుతున్నావ్?’ అని లాస్య ఏదో అనబోయిందిగానీ, దివి అస్సలు కేర్ చేయలేదు.
ఇలాంటిదే బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో రెండో సీజన్‌లోనూ జరిగింది. కౌశల్, తనను టచ్ చేశాడంటూ భాను గగ్గోలు పెట్టింది. ఆ ఎపిసోడ్ భానుకి బ్యాడ్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. భానుని అలా పాంపర్ చేసింది మిగతా హౌస్‌మేట్స్ అప్పట్లో.
సో, అప్పటి కౌశల్‌ని ఇప్పుడు ఈ ఎపిసోడ్‌లో రాజశేఖర్‌తో పోల్చవచ్చేమో. లాస్య అలా అనడం తప్పే. అదే సమయంలో దివి, లాస్యని ‘షట్ అప్’ అనడమూ సబబు కాదు. అంతిమంగా ఇది జస్ట్ ఓ రియాల్టీ షో.