Divya Bharti Biopic.. దివ్య భారతి గుర్తుందా.? సుడిగాలి సుధీర్ సరసన ఓ తెలుగు సినిమాలో నటిస్తోన్న యంగ్ బ్యూటీ దివ్య భారతి కాదు.! ఈ దివ్య భారతి వేరు.!
మెగాస్టార్ చిరంజీవి సరసన ‘రౌడీ అల్లుడు’ సినిమాలో నటించింది కదా.? ఆ దివ్య భారతి.! ఇప్పుడామె జీవించి లేదు.!
విక్టరీ వెంకటేష్ సరసన ‘బొబ్బలి రాజా’ సినిమాలోనూ దివ్య భారతి నటించింది. బాలకృష్ణతోనూ, మోహన్‌బాబుతోనూ నటించింది దివ్య భారతి.
చాలా తక్కువ సినిమాలతోనే చాలా చాలా ఎక్కువ పేరు ప్రఖ్యాతులు నటిగా దిబ్య భారతి సొంతం చేసుకుంది.
‘తొలి ముద్దు’ దివ్య భారతికి ఆఖరి సినిమా. ఆ సినిమాలో నటిస్తున్న సమయంలోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందామె.
Divya Bharti Biopic.. మిస్టరీ వీడుతుందా.?
దివ్య భారతి మరణం అప్పటికీ.. ఇప్పటికీ ఓ మిస్టరీనే.! ఆ మిస్టరీ ఇప్పటి వరకూ తేలలేదు. భవిష్యత్తులోనూ తేలదు. ఆమెను చంపేశారంటారు.. ఆత్మహత్య అంటారు.!
ఇంతకీ, దివ్య భారతి ఎలా చనిపోయింది.? ఆ విషయాన్ని దివ్య భారతి బయో పిక్‌లో రివీల్ చేయబోతున్నారా.?
మలయాళంలో దివ్య భారతి బయోపిక్ తెరకెక్కబోతోందిట. ఈ మేరకు అన్ని కసరత్తులూ పూర్తయినట్లు తెలుస్తోంది. నటీనటులెవరు.? అన్న విషయాలు ముందు ముందు తేలనున్నాయ్.
అంతటి అందగత్తె ఇప్పుడెక్కడుంది.?
మహానటి సావిత్రి మరణానికి అసలు కారణమేంటి.? సిల్క్ స్మిత ఎందుకు చనిపోయింది.? ఇలా చెప్పుకుంటూ పోతే, చాలామంది నటీమణుల అకాల మరణాలు ఇప్పటికీ మిస్టరీనే.
సిల్క్ స్మిత బయోపిక్ ‘డర్టీ పిక్చర్’ రూపంలో తెరకెక్కింది. కానీ, సిల్క్ స్మిత మరణానికి కారణమేంటో తేల్చలేకపోయారు.
కాకపోతే, ‘డర్టీ పిక్చర్’ సినిమా, ఆ నిర్మాతలకు కాసుల పంట పండించింది. దివ్య భారతి (Divya Bharti) బయో పిక్ కూడా అంతేనేమో.!
Also Read: చచ్చేది ఒక్కసారే.! ఎవరికైనా తప్పదది.!
ఇంతకీ, దివ్య భారతి బయోపిక్‌లో నటించబోయే ఆ అందగత్తె ఎవరు.? దివ్య భారతి అంతటి అందాన్ని ఇప్పుడున్న యంగ్ బ్యూటీస్‌లో కనుగొనగలమా.?
ప్చ్.. కష్టమే.! కానీ, అసాధ్యమైతే కాకపోవచ్చు.
అన్నట్టు, ‘తొలి ముద్దు’ సినిమా చిత్రీకరణ సమయంలోనే దివ్య భారతి అనుమానాస్పద రీతిలో మృతి చెందడంతో, రంభతో ఆ సినిమాని పూర్తి చేసిన సంగతి తెలిసిందే.