Divyansha Kaushik Glamour Majili.. అక్కినేని కాంపౌండ్ హీరోతో తొలి సినీ మజిలీ స్టార్ట్ చేసిన ముద్దుగుమ్మ దివ్యాంశ కౌశిక్. అదేనండీ.! నాగచైతన్య నటించిన ‘మజిలీ’ సినిమా.
ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించిన ముద్దుగుమ్మే దివ్యాంశ కౌశిక్. నాగ చైతన్యతో ఆన్ స్క్రీన్ ఘాడమైన రొమాన్స్ చేసేసిందీ అందాల భామ దివ్యాంశ కౌశిక్.
అరె.! భలే వుందే హీరోయిన్ అనే ప్రశంసలయితే దక్కించుకుంది కానీ, అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే అందుకుందీ అమ్మడు.
Divyansha Kaushik Glamour Majili.. సెలెక్టివ్‌గానే..
‘మజిలీ’ తర్వాత సందీప్ కిషన్‌తో ‘మైఖేల్’ మూవీలో మెరిసింది. అక్కడా హాట్ అప్పీల్‌లో ఏమాత్రం మొహమాటపడిందే లేదు.

కానీ, మాస్ రాజా రవితేజతో ‘రామారావు ఆన్ డ్యూటీ’ కోసం పద్దతిగా హోమ్లీ గాళ్‌గా కనిపించి మెప్పించింది. రీసెంట్‌గా సిద్దార్ధ్‌తో ‘టక్కర్’ సినిమాలో నటించింది.
త్వరలోనే సుధీర్ వర్మ తెరకెక్కించబోయే సినిమాలో దివ్యాంశ కౌశిక్ నటించనుంది. నిఖిల్ సిద్దార్ధ్‌తో ఈ సినిమాలో జత కట్టబోతోంది దివ్యాంశ.
అట్టాంటి పట్టింపుల్లేవ్.!
హాట్ అప్పీల్‌తో పాటూ, అన్ని రకాలా స్క్రీన్ ప్రెజెన్స్ టాలెంట్స్ పుష్కలంగా వున్నాయి దివ్యాంశ కౌశిక్‌లో. సరైన హిట్టు ఒక్కటి పడితే చాలు పాప టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసేసుకుంటుంది.

నిఖిల్ ప్రస్తుతం స్టార్ హీరో దిశగా ప్రాజెక్లులు టేకప్ చేస్తున్నాడు. సో, నిఖిల్ సినిమాలో హీరోయిన్ అంటే, సక్సెస్ అయ్యే అవకాశాలు చూజాయగా కనిపిస్తున్నాయ్.
ఆ సంగతి అలా వుంచితే, సోషల్ మీడియాలో దివ్యాంశ చేసే అందాల దాడి అంతా ఇంతా కాదండోయ్. ఈ రకంగానే చేసిన సినిమాలు తక్కువే అయినా, నెట్టింట పిచ్చ పాపులారిటీ దక్కించుకుంది.
Also Read: వైరల్ వీడియో.! జింకలు పాముల్ని తింటాయా.?
భాషతో సంబంధం లేదంటోంది. ఆల్రెడీ హిందీలో ఓ సినిమాలో నటించింది. తెలుగుతో పాటూ, తమిళ, మలయాళ ఇతర భాషల్లోనూ నటించాలనుకుంటోందట.
అయితే, ఎప్పటికైనా తెలుగులో మంచి హీరోయిన్‌గా సెటిలవుతా.. అంటూ పిచ్చ క్లారిటీతో వుందీ ‘మజిలీ’ పాప.