Divyansha Kaushik Smiley.. అందాల భామలు ఏం చేసినా అందమేనండోయ్. అలా చిరునవ్వులు చిందించినా చాలు ఆ నవ్వులో నవరత్నాల్ జాలువారాల్సిందేగా.!
అదే చేస్తోందీ అందాల ‘మజిలీ’ పాప. అదేనండోయ్. దివ్యాంశ కౌశిక్. ‘మజిలీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిందీ ఢిల్లీ భామ.
తొలి సినిమాకే యాక్టింగ్ స్కిల్స్‌తో పాటూ, గ్లామర్ టాలెంట్‌నీ చూపించేసింది. ఆ తర్వాత ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలో మాస్ రాజా రవితేజ పక్కన పద్ధతిగా కనిపించి ఇంకోసారి మెప్పించింది.
Divyansha Kaushik Smiley.. పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్..
బాలీవుడ్‌లో దివ్యాంశ కౌశిక్ నటించిన ‘ది వైఫ్’ మూవీ ఆమెలోని నెక్స్‌ట్ లెవల్ టాలెంట్‌ని బయటికి తీసింది. అలాగే తమిళంలో ‘టక్కర్’ సినిమాలోనూ దివ్యాంశ నటించింది.
ఇప్పుడు ఓ తెలుగు సినిమాలో నటిస్తోంది. సుధీర్ వర్మ ఈ సినిమాకి దర్శకుడు. కాగా, సినిమాల సంగతెలా వున్నప్పటికీ పాప సోషల్ మీడియాలో యమా యాక్టివ్.
సినిమాల లిస్టు చిన్నదే అయినా, నెట్టింట ఫోటో షూట్స్ లిస్టు మాత్రం చాంతాడంత.! డిఫరెంట్ యాంగిల్స్‌లో ఫోటోలకు పోజిచ్చి నెటిజన్స్‌కి అందాల వలలు విసురుతుంటుంది దివ్యాంశ కౌశిక్.

అవును నిజమే, ఆ పోజులకు పడిపోని కుర్రకారుంటుందా.? తాజాగా కొన్ని ఫోటోలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయ్. అందంగా నవ్వులు చిందిస్తున్న ఫోజులవి.
అందగత్తెలు ఏం చేసినా అదో ట్రెండింగే కదా. ఈ నవ్వులే ఇప్పుడు ట్రెండింగ్ అయిపోయాయ్ మరి. అంతేనా ఈ పిక్స్‌లో దివ్యాంశ కౌశిక్ కాస్టూమ్స్ హాట్ టాపిక్ అయ్యాయ్.
Also Read: Tamannaah Bhatia.. కైపెక్కిస్తోన్న అందాల ఖజానా.!
తేనె కలర్ అవుట్ ఫిట్‌లో మ్యాచింగ్ జ్యూయలరీ ధరించి కవ్విస్తోంది. మరీ ముఖ్యంగా నుదుటిపై ఆ రత్నాల గొలుసూ, మెడలో రాళ్లు పొదిగిన నెక్లస్సూ.. దివ్యాంశ అందాన్ని ఎన్నో రెట్లు పెంచేస్తున్నాయ్.
వీటికి తోడు పెదాలపై ఆ స్శచ్చమైన చిరునవ్వు.. ఆ నవ్క్వులోనే ఏదో మ్యాజిక్ వుంది. నిండు పున్నమిలా వెలుగులు విరజిమ్ముతోంది ఆ నవ్వుల్లో దివ్యాంశ కౌశిక్.