Divyansha Kaushik Takkar Beauty.. ‘మజిలీ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ దివ్యాంశ కౌశిక్, సినిమాల కన్నా, సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా వుంటుంది.
గ్లామర్‌లో పాప చాలా తోపు. రకరకాల గ్లామర్ యాంగిల్స్‌లో ఫోటో సెషన్లు చేయించుకుంటూంటుంది. ఆ ఫోటోలను నెట్టింట పోస్ట్ చేస్తూ విపరీతంగా ఫాలోయింగ్ సంపాదించుకుంటోంది.
తాజాగా మిర్రర్ కాన్సెప్ట్ ఫోటో షూట్ చేయించుకుంది దివ్యాంశ కౌశిక్. మిర్రర్ బ్యాక్ గ్రౌండ్‌లో దివ్యాంశ చేస్తున్న హాట్ హల్‌చల్ నెటిజన్లను షేక్ చేస్తోందంటే అతిశయోక్తి కాదేమో.
Divyansha Kaushik Takkar Beauty.. జస్ట్ శాంపిల్ మాత్రమే..
తొలి సినిమా ‘మజిలీ’లోనే వేడి వేడిగా ఘాటైన లిప్‌లాక్‌లు లాగించేసి కుర్రకారు గుండెల్లో తిష్ట వేసేసింది దివ్యాంశ (Divyansha Kaushik). తర్వాత ‘రామారావు ఆన్ డ్యూటీ’లో మాస్ రాజా రవితేజకు భార్యగా నటించి మెప్పించింది.

గ్లామర్ రోల్ అయినా, ట్రెడిషనల్ రోల్ అయినా నాకు ఓకే.. అన్నట్లుగా ఈ రెండు సినిమాలతోనూ దివ్యాంశ కౌశిక్ (Divyansha Kaushik) శాంపిల్ టచ్ ఇచ్చింది.
రీసెంట్‌గా ‘టక్కర్’ సినిమాలో సిద్దార్ధకు జోడీగా మోడ్రన్ లుక్స్‌లో కనిపించింది. ఈ సినిమాలో చాలా క్యూట్‌గా కనిపిస్తూనే గ్లామర్ టాప్ లేపేసింది అందాల దివ్యాంశ కౌశిక్.
అన్నట్లు హిందీలో ‘ది వైఫ్’ అనే సినిమాలోనూ నటించిందీ ఢిల్లీ భామ (Divyansha Kaushik). తెలుగులోనే మరిన్ని సినిమాల్లో నటించాలని అనుకుంటోందట.
Also Read: వావ్.! గురూజీని ఇంప్రెస్ చేసిన కేతిక శర్మ.!
ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కబోయే థ్రిల్లర్ మూవీలో దివ్యాంశ కౌశిక్ నటిస్తోంది. ఈ సినిమాలో యాక్టింగ్ స్కోప్ వున్న పాత్రలో దివ్యాంశ (Divyansha Kaushik) కనిపించబోతోందనీ తెలుస్తోంది.
సరైన ఛాన్సొస్తే, గ్లామర్‌లోనే కాదు, యాక్టింగ్‌లోనూ ధీటైన సత్తా చూపించగలనని కాన్ఫిడెంట్‌గా చెబుతోందీ అందాల బిజిలీ.