Doctor Sreeleela Acterss Tollywood.. ‘డాక్టరవ్వాలనుకున్నానుగానీ… యాక్టరయ్యాను..’ అనే మాట చాలా సందర్భాల్లో సినీ ప్రముఖుల నుంచి విన్నాం.! వింటూనే వున్నాం.
కానీ, డాక్టర్లు కూడా యాక్టర్లవుతున్నారు.! సినీ నటుడు రాజశేఖర్ డాక్టరే మరి.! చెప్పుకుంటూ పోతే, చాలామంది డాక్టర్లున్నారు సినీ రంగంలో.
వైద్య వృత్తిని కొనసాగిస్తూ సినిమాల్లో కొనసాగిస్తున్నోళ్ళూ.. వైద్య వృత్తిని వదిలేసి, సినిమాలకే పరిమితమైనోళ్ళూ.. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద కథే వుంది.!
Doctor Sreeleela Acterss Tollywood.. డాక్టర్ శ్రీలీల.. పరీక్షలట.!
తెలుగు సినీ పరిశ్రమలో (Telugu Cinema Industry) ఇప్పుడు అత్యంత బిజీగా వున్న హీరోయిన్ ఎవరంటే, ఠక్కున గుర్తుకొచ్చే పేరు శ్రీలీలదే.!
బ్యాక్ టు బ్యాక్ సినిమాలున్నాయి శ్రీలీలకి. వరుసగా రిలీజులూ వున్నాయ్.! ఇంకా ఇంకా కొత్త సినిమాలకు సైన్ చేస్తూనే వుంది.
అయితే, ‘ఎంబీబీఎస్’ పరీక్షల నేపథ్యంలో రెండు నెలలపాటు, సినిమాలకు ‘బ్రేక్’ ఇవ్వబోతోందిట శ్రీలీల (Sreeleela).

ఆ రెండు నెలలు కష్టపడితే, ఎంబీబీఎస్ పూర్తయిపోతుందట శ్రీలీలకి.! అన్నట్టు, గతంలో ఇలాగే పరీక్షలు రాస్తూ, సినిమాలు చేసింది నివేదా థామస్.
సాయి పల్లవి (Sai Pallavi) కూడా ఆ బాపతే.! సాయి పల్లవి కూడా డాక్టరేనండోయ్.! ‘నేల టిక్కెట్టు’ ఫేం మాళవిక శర్మ అయితే, న్యాయ విద్య అభ్యసిస్తూ సినిమాల్లో నటించింది.
Also Read: ప్రియాంక చోప్రా కొత్త యాపారం.!
శ్రీలీల ప్రస్తుతం మహేష్‌తో ‘గుంటూరు కారం’ సినిమాలోనూ, నితిన్ సరసన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ’, రామ్ పోతినేని సరసన ‘స్కంద’ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
వైష్ణవ్ తేజ్ సరసన ‘ఆదికేశవ’ సినిమాలోనూ ఆమే హీరోయిన్. నితిన్, వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కే సినిమాకీ శ్రీలీలనే ఎంపిక చేశారు.
రవితేజ సరసన శ్రీలీల ఇంకోసారి కనిపించబోతోంది. మొత్తంగా అరడజనుకి పైగానే సినిమాలున్నాయ్ శ్రీలీల చేతిలో ఇప్పుడు.
మొత్తమ్మీద సినిమాల్నీ, చదువునీ బ్యాలెన్స్ చేసుకుంటున్న శ్రీలీల నిజంగానే చాలా మందికి స్ఫూర్తి.! ఔను, ఒత్తిడితో కూడిన చదువునీ, ఒత్తిడితో కూడిన నటనా రంగాన్నీ బ్యాలెన్స్ చేసుకోగలగడం చిన్న విషయం కాదు.
