Table of Contents
Dog Donkey Allu Arjun.. కుక్క చేసే పనిని తాను చేయాలని గాడిద అనుకోకూడదు.! కుక్క పని కుక్కే చెయ్యాలి.. గాడిద పని గాడిదే చేయాలి.. అన్నది పెద్దలు చెప్పే మాట.!
అసలు ఇప్పుడిదంతా ఎందుకు.? అయినా, పెద్దలంటే ఇప్పుడు ఎవరికి గౌరవం వుంది గనుక.! నేనే తోపు, దమ్ముంటే ఆపు.. అనే దిక్కుమాలిన ఆటిట్యూడ్ రాజ్యమేలుతున్న రోజులివి.
అసలు విషయానికొస్తే, సినీ నటుడు అల్లు అర్జున్ మీద కేసు నడుస్తోంది. ‘పుష్ప 2 ది రూల్’ సినిమా రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో ఓ మహిళ చనిపోవడానికి సంబంధించిన కేసు అది.
Dog Donkey Allu Arjun.. అల్లు అర్జున్ విచారణకు హాజరయ్యాడు.. అయితే, ఏంటి.?
ఈ కేసులో ఇప్పటికే అల్లు అర్జున్ అరెస్టయ్యాడు, జైలుకు కూడా వెళ్ళాడు, మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చాడు. తాజాగా, పోలీసుల యెదుట ఈ కేసు విషయమై విచారణకు హాజరయ్యాడు.
సినిమాల్లో చెప్పినట్లు, ‘తగ్గేదే లే’ అని అంటే కుదరదు కదా.! రియల్ లైఫ్‌లో పోలీసులు వేరేలా వుంటారు. ‘పుష్ప 2 ది రూల్’ సినిమాలో పోలీసుల్ని ఎర్రిపప్పల్ని చేసినట్లు ఇక్కడ జరగదు.!
అది అల్లు అర్జున్‌కి కూడా తెలుసు. అందుకే, పోలీసులు విచారణకు పిలవగానే, విచారణకు హాజరయ్యాడు.
దాదాపు మూడున్నర గంటల సేపటి తర్వాత విచారణ ముగించుకుని, అల్లు అర్జున్ తిరిగి తన ఇంటికి చేరుకున్నాడు.
తీర్పులిచ్చేస్తున్న ఎర్నలిస్టులు..
ఇంకోపక్క, అల్లు అర్జున్‌కి పోలీసులు విచారణ నిమిత్తం నోటీసులు పంపినప్పటినుంచీ, మీడియాలో రకరకాల ఊహాగానాలు, చర్చోపచర్చలు షరామామూలే.
విచారణ సందర్భంగా అల్లు అర్జున్ కోసం పోలీసులు తయారు చేసిన ప్రశ్నావళి.. అంటూ, కథనాల్ని వండి వడ్డించింది మీడియా. ఏ పోలీస్ అధికారి అయినా, ఆ ప్రశ్నావళిని లీక్ చేసి వుంటారా.? ఛాన్సే లేదు.
ఇక్కడ, మీడియానే పోలీస్ అధికారి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేసింది. అద్గదీ అసలు సంగతి.!
ఇప్పుడు అర్థమయ్యింది కదా.. కుక్క పని కుక్కే చెయ్యాలి.. గాడిద పని గాడిదే చెయ్యాలంటూ, అసలెందుకు మొదలు పెట్టామో.!
ఘటన జరిగినప్పటినుంచి, మీడియా వేదికగా జరిగిన చర్చల్లో.. అల్లు అర్జున్‌ని నేరస్తుడిని చేసేశారు. ఫలానా రకమైన శిక్ష పడుతుందంటూ తీర్పులిచ్చేసినంత పని చేశారు.
నవ్విపోదురుగాక..
ఇటు పోలీస్ వ్యవస్థ, అటు న్యాయ వ్యవస్థ కదా.. తేల్చాల్సింది.! మీడియా తీర్పులేంటి.? నవ్విపోదురుగాక సోకాల్డ్ మీడియాకేటి సిగ్గు.?
తుత్తర.. మామూలు తుత్తర కదా.! వేరే ఛానల్‌లో ఏం చెప్పేస్తారో, ముందుగానే మనమే చెప్పేద్దాం.. అనే కక్కుర్తి. వెబ్‌సైట్ల సంగతి సరే సరి.!
నిజానికి, వార్త అంటే, చెత్త పోగేసి జనం మీదకు వదిలెయ్యడం కాదు.! కానీ, ఇప్పడా చెత్తే వార్త అయిపోయింది.!
శవ పాత్రికేయం, పాత్రికేయ వ్యభిచారం మాత్రమే కనిపిస్తున్నాయ్. మీడియా ఎక్కడుంది.. అంతా మాఫియానే కదా.! అల్లు అర్జున్ విషయంలోనే కాదు, ఏ సినీ ప్రముఖుల విషయంలో అయినా, ఇదే దుస్థితి.
రానురాను ఈ మాఫియా, క్యాన్సర్ మహమ్మారి కంటే దారుణంగా తయారైంది.! పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ.. మీడియాపై ఉక్కుపాదం మోపాల్సిందే.. అనే స్థాయికి జనంలో అసహనం పెరిగిపోతోంది.