Eesha Rebba Vacation Goals.. ఆమె ఎవరు.? తర్వాత మాట్లాడుకుందాం.! ముందైతే, ఆమె అక్కడే వుండిపోయిందట.! ఎక్కడ.? ఎందుకు.? ఏమిటి.?
విహార యాత్రకి వెళ్ళిందామె.! అక్కడి ప్రకృతి అందాల నడుమ తన మనసుని అక్కడే వదిలేసి వచ్చేసింది. అద్గదీ అసలు సంగతి.
సముద్రానికీ, అందమైన అమ్మాయికీ.. విడదీయరాని అనుబంధం వుంది. ఆపై, సుదూరాన చల్లటి సూర్యుడు కనిపిస్తున్నాడాయె.!

ఉదయమా.? సాయంత్రమా.? ఏదైతేనేం, చక్కనమ్మ చర్మ సౌందర్యం అస్సలు దెబ్బకుండా, సుతిమెత్తని భానుడి కిరణాలు ఆమెను తాకుతోంటే.. చక్కిలిగిలి కలుగుతుంది మరి.!
ఇలా ఆమెని చూస్తే, కుర్రకారు గుండెలూ అదురుతాయ్.!
Eesha Rebba Vacation Goals.. ఎవరామె.?
ఇంకెవరు.. మన తెలుగు బ్యూటీ ఈషా రెబ్బా.! ‘మెంటల్లీ స్టిల్ హియర్..’ అంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు షేర్ చేసింది ఇషా రెబ్బా.!
అద్గదీ అసలు సంగతి.! ఏమాటకామాటే చెప్పుకోవాలంటే, ఇలా ఈషా రెబ్బాని (Eesha Rebba) చూస్తే కళ్ళు పక్కకి తిప్పుకోవడం కష్టం మరి.!

కెరీర్ విషయానికొస్తే, అందం అభినయం.. అన్నీ వున్నా, ఎందుకో రావాల్సిన స్టార్‌డమ్ అయితే ఈ బ్యూటీకి రాలేదు.
తెలుగమ్మాయిలంటే, తెలుగు ఫిలిం మేకర్స్‌కి చులకనా.? ఏమో, అలాగే అనుకోవాలేమో.! చూస్తున్నాం కదా, ముంబై ముద్దుగుమ్మలతో పోల్చితే, ఈషా రెబ్బాకి ఏం తక్కువ.?