Egg for Brain Health.. మెదడుకు ఆరోగ్యానిచ్చే అనేక ఆహార పదార్ధాల్లో కోడు గుడ్డుది మొదటి స్థానం అంటున్నారు వైద్య నిపుణులు.
ఆ మాటకొస్తే, వయసుతో సంబంధం లేకుండా ఏ వయసు వారైనా కోడిగుడ్డును ప్రతీ రోజూ తినేయొచ్చు.
ముఖ్యంగా మెదడు చురుగ్గా పని చేసేందుకు కోడి గుడ్డు చాలా ఉపకరిస్తుందని అంటున్నారు. ప్రతీ రోజూ గుడ్డు తినేవారిలో మెదడు కణాలు ఆరోగ్యంగా వుంటాయట. తద్వారా మెదడు చురుగ్గా పని చేస్తుందట.
ముఖ్యంగా గుడ్డు సొనలు (Egg Yolks) తినే వారిలో జ్ఞాపక శక్తి మెండుగా వుంటుందట.
మెదడు పని తీరును ప్రోత్సహించడం, మెదడు కణాల మధ్య కమ్యూనికేషన్ మెరుగుపరచడం లాంటివి గుడ్డు సొన ఎక్కువగా తినేవారిలో అధికంగా వుంటాయని నిపుణులు చెబుతున్నారు.
Egg for Brain Health.. డయాబెటిస్ వున్నవాళ్లు కోడి గుడ్డు తింటే.!
డయాబెటిస్ వున్నవాళ్లు గుడ్డు తింటే షుగర్ ఎక్కువవుతుందని భావిస్తుంటారు. అది కూడా తప్పే అంటున్నారు.
కోడి గుడ్డులో ప్రొటీన్ కంటెంట్ ఎక్కువగా వుంటుంది. ప్రోటీన్స్ సక్రమంగా శరీరానికి అందితేనే ఆరోగ్యంగా వుండగలం. సో, ఏ వ్యాధితో బాధపడేవారైనా సరే, కోడి గుడ్డు నిర్మొహమాటంగా తినేయొచ్చంటున్నారు.
అధిక బరువు సమస్య వున్నవారికీ కోడి గుడ్డు ఓ వరమే అని పరోక్షంగా చెప్పొచ్చేమో. అందుకు కారణం గుడ్డులో ప్రొటీన్లు అధికంగా వుండడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది.

తద్వారా తినాల్సిన ఆహారం కూడా మితంగా తీసుకుంటారు. ఆ కారణంగా బరువు తగ్గే అవకాశాలున్నాయ్ అని నిపుణులు చెబుతున్నారు.
అందుకే ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో ఒక గుడ్డు తింటే ఆరోగ్యానికి అరోగ్యం, బరువు తగ్గించుకునే మార్గం రెండూనూ. అయితే, కేవలం గుడ్డు మాత్రమే తిని ఊరుకుంటే, నీరసం వస్తుంది కదా.? అనే అపోహలుంటాయ్ చాలా మందిలో.
అలాంటి అపోహలు అస్సలు వుండొద్దంటున్నారు సంబంధిత డైట్ నిపుణులు.
ఆ అపోహలు వద్దు సుమీ.!
కోడి గుడ్డు రాత్రి పూట తింటే జీర్ణం కాదన్న అపోహ చాలా మందిలో వుంటుంది. కానీ అందులో ఎంత మాత్రం నిజం లేదంటున్నారు.
కోడి గుడ్డులో పీచు పదార్ధం (Fiber Content) అధికంగా వుంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగు పరచడంలో తోడ్పడుతుంది. స్త్రీలలో రొమ్ము క్యాన్సర్‌ని అడ్డుకునే శక్తి కోడిగుడ్డుకు అధికంగా వుందట.

అలాగే, గర్భిణులు, బాలింతలు కోడి గుడ్డును ఎక్కువగా తీసుకుంటే మంచిందంటున్నారు. గుడ్డులోని ఐరన్ పుట్టబోయే బిడ్డకీ, పుట్టిన తర్వాత తల్లి పాల ద్వారా బిడ్డ ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
Also Read; సామాజికోన్మాదం.. సమాజ వినాశనానికి సంకేతం.!
సూచన: ఈ సంకలనం కేవలం కొందరు వైద్య నిపుణుల సలహాలూ, సూచనలూ మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో వున్న సమాచారం ద్వారా సేకరించబడినది.
ఏ చిట్కా అయినా, ఆరోగ్యానికి సంబంధించిన ఏ ఆహార పదార్ధమైనా వైద్య సలహా లేకుండా తీసుకోవడం అంత మంచిది కాదేమో.!