బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్.. తాజా ఎపిసోడ్‌లో ఈ సారి, నామినేషన్స్ (Baba Bhaskar Siva Jyothy) ప్రక్రియలో భాగంగా ఇద్దరిద్దరు చొప్పున కన్‌ఫెషన్ రూమ్‌కి పిలిపించారు బిగ్‌బాస్. ఈ క్రమంలో హౌస్ మేట్స్ జాతకాలు బయట పడిపోయాయి. ఒకరి ముందు ఇంకొకరు తమ తమ ఇన్నర్ ఫీలింగ్స్‌ని బయట పెట్టేసుకున్నారు.
ముఖ్యంగా బాబా భాస్కర్, ఆషూ పెయిర్‌కి సంబంధించి, ఇంతవరకూ సైలెంట్‌గా ఉన్న అషూ రెడ్డి, బాబా భాస్కర్‌పై విషం చిమ్మేసింది. ఈ వారం కూడా కిచెన్ డ్యూటీ తానే తీసుకుంటాను అనడం అషూ రెడ్డికి నచ్చలేదట. సో ఆ కారణంగా ఆయన్ని నామినేట్ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఆమె లోపలకు వచ్చింది.
కానీ, అంతకు ముందే బాబా భాస్కర్ సెల్ఫ్ నామినేట్ చేసుకున్నారు. పోనీ బాబా భాస్కర్ సెల్ఫ్ నామినేట్ అయ్యాకా అయినా, ఆషూ రెడ్డి, తన ఒపీనియన్‌ని మనసులోచే దాచుకుంటే బావుండేది. అలా కాకుండా, బయటపడిపోయింది. దాంతో బాబా భాస్కర్ పాపం చాలా డీలా పడ్డారు. కాసేపు ఆయనకు ఏం జరిగిందో అర్ధం కాలేదు.
అలాగే శివజ్యోతి కూడా ఫుడ్ విషయంలో బాబా భాస్కర్‌ని అపార్ధం చేసుకుంది. ఇలా పలు కారణాలతో ఎప్పుడూ యాక్టివ్‌గా నవ్వుతూ, నవ్విస్తూ ఉండే బాబా భాస్కర్ కాస్త డిస్ట్రబ్ అయ్యారు. ఇక నామినేషన్ ప్రక్రియలో భాగంగా, వరుణ్ – మహేష్ పెయిర్‌లో ఇద్దరూ నామినేట్ కావడానికి ఇష్టపడలేదు. ఎట్టకేలకు వరుణ్ సందేశ్ కాంప్రమైజ్ అయ్యాడు. మహేష్ విట్టా సేఫ్ అయ్యాడు.
వితికా షెరూ – రవి కృష్ణ కాంబినేషన్‌లో టాస్క్‌కి సంబంధించి, రవికృష్ణ వైపు నుండి మిస్టేక్ ఉండడంతో, ఆయన తానే నామినేట్ అవుతానని (Baba Bhaskar Siva Jyothy) ఒప్పుకున్నాడు. అలా వితికా షెరూ సేఫ్ అయ్యింది. ఇక రోహిణి – శివజ్యోతి ఫ్రెండ్లీగా ఒకరి కోసం ఒకరు నామినేట్ కావడానికి సిద్ధపడ్డారు. కానీ, శివజ్యోతి, రోహిణి కోసం త్యాగం చేసింది. తానే నామినేట్ అయ్యింది.
నామినేషన్ ప్రక్రియ జరుగుతుండగానే.. లివింగ్ రూమ్‌లో చెవిలో గుసగుసలాడుకుంటూ వీరిద్దరూ చేసిన ఓవరాక్షన్‌కి బిగ్‌బాస్ ఆగ్రహానికి గురయిన వీరిరువురూ ఈ వారంతో పాటు, వచ్చే వారం కూడా నామినేట్ అయ్యారు. టాస్క్‌లో తప్పిదం కారణంగా శ్రీముఖి ఆల్రెడీ నామినేట్ అయ్యింది.
అలా ఈ వారం హౌస్ నుండి బయటికి వెళ్లేందుకు జరిగిన ప్రక్రియలో కొందరు జాతకాలు బయట పెట్టేసుకున్నారు. అలా ఈ వారం శ్రీముఖి, రాహుల్, శివజ్యోతి, రోహిణి, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, రవికృష్ణ నామినేట్ అయ్యారు.