Table of Contents
Employment World Wide Trend.. ఉద్యోగాలు ఊడిపోతున్నాయ్.! ప్రముఖ కంపెనీలు, తమ ఉద్యోగుల్ని తొలగిస్తూ ప్రకటనలు జారీ చేస్తున్నాయ్.!
అదీ, ఇదీ.. అని లేదు. వేలాది, లక్షలాది ఉద్యోగాల్ని కల్పిస్తోన్న ప్రముఖ సంస్థలే ఉద్యోగుల్ని తొలగిస్తున్న పరిస్థితి. కారణమేంటి.? అన్న ప్రశ్నకు భిన్న వాదనలున్నాయి.

ప్రధానంగా సాఫ్ట్‌వేర్ కంపెనీల్నే, మనం ఇప్పుడు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న సంస్థలుగా పేర్కొంటున్నాం. వీటితోపాటే.. ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమ సంస్థలు కూడా.
అమేజాన్, ఫ్లిప్‌కార్ట్.. వంటి సంస్థలూ ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది ఉద్యోగాలను కల్పిస్తున్నాయి.. ఎప్పటికప్పుడు, తమ ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి కూడా.
Employment World Wide Trend.. ‘తొలగింపు’లో అదే కీలకం..
‘నిర్వహణ ఖర్చులు భారమైపోతుండడం’ అనేది, ‘ఉద్యోగాల తొలగింపు’లో కీలక అంశంగా కనిపిస్తోంది. ఆయా సంస్థలు, వందల కోట్లు, వేల కోట్లు ఆర్జిస్తున్నాయి కదా.? అంటే, అది మళ్ళీ వేరే చర్చ.

ప్రపంచ వ్యాప్తంగా, విద్యాధికులు పెరుగుతున్నారు.. ప్రొఫెషనల్స్ కూడా పెరుగుతున్నారు. యువ రక్తానికి ఎక్కువ అవకాశాలు.. అనుభవం గడించే కొద్దీ, తొలగింపులు.. సర్వసాధారణమైపోయాయి.
అన్ని చోట్లా ఇదే జరుగుతోందా.? అంటే, చాలా చోట్ల ఇదే పరిస్థితి. అమెరికాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు, అమెరికాపై ఆశలు పెట్టుకున్న మన యువతకు చుక్కలు చూపిస్తున్నాయి.
ఆకాశ హార్మ్యాల పరిస్థితి ఏంటి.?
దాంతో, ప్రత్యామ్నాయంగా.. ఇతర దేశాలపై మన దేశ యువత ఫోకస్ పెడుతోంది. అక్కడా, మనల్ని వెల్లగొట్టేస్తోనో.? ఇదో మిలియన్ డాలర్ క్వశ్చన్.
ప్రపంచ వ్యాప్తంగా వివిధ కార్పొరేట్ సంస్థల భవనాలు చూస్తే, ఆకాశహార్మ్యాలే అన్నీ.. వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాల్ని కల్పిస్తున్న భవనాలవి.

మరి, ఈ తొలగింపులతో.. ఆ భవనాలన్నీ ఖాళీ అయిపోతాయా.? అవన్నీ భూత్ బంగ్లాలుగా మారిపోతాయా.? ఛాన్సే లేదు. ముందే చెప్పుకున్నాం కదా.. పాత నీరు పోతుంది, కొత్త నీరు వస్తుందంతే.
ఉద్యోగావకాశాలు దక్కించుకుంటున్నవాళ్ళ సంగతి సరేగానీ.. ఉద్యోగాల్ని పోగొట్టుకుంటున్నవారి పరిస్థితేంటి.?
అగమ్య గోచరం.. అద్భుతమైన అవకాశం..
ఉన్నత చదువులు చదివి, ఉన్నత ఉద్యోగాలూ చేసి.. చిన్నా చితకా వ్యాపారాలు పెట్టుకోవాల్సి వస్తోంది.
ప్రపంచం పోకడ ఇప్పుడున్న పరిస్థితుల్లో సామాన్యులకి అస్సలు అర్థం కావడంలేదు. భవిష్యత్ అగమ్యగోచరంగానే కనిపిస్తోంది.

ఆ నిరాశా నిస్పృహలతోనే, ‘భూత్ బంగ్లాలు..’ అన్న ప్రస్తావన తెస్తున్నారు కొందరు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవడమే.. అన్ని సమస్యలకూ పరిష్కారం.
భయాల్ని వదిలేసి, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. ఆయా రంగాల్లో ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవడం ద్వారా, ‘అనుభవానికి’ తగిన గుర్తింపు దొరుకుతుంది.
Also Read: టెస్టు క్రికెట్టుకి పూర్వ వైభవం వస్తుందా.?
యాంత్రీకరణ అప్పట్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాల్ని తగ్గించింది.. కానీ, అంతలోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కొత్త రంగాల్లో పోటెత్తాయి.
ఆటోమేషన్, ఏఐ.. ఇవిప్పుడు ఉద్యోగ ఉపాధి అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అదే సమయంలో, కొత్త కొలువులు రానున్న పెరిగే అవకాశాలూ లేకపోలేదు.
