Environment Day Allu Arjun.. ప్రతి యేడాదీ పర్యావరణ దినోత్సవం పేరుతో మొక్కలు నాటడం గురించి బోల్డంత చర్చ జరుగుతుంటుంది.!
ఎవరి కోసం ఇదంతా.? ఇంకెవరి కోసం మనకోసమే.! మన భవిష్యత్తు కోసమే.! భావితరాల కోసమే.! డబ్బు లేకపోయినా బతకగలమేమోగానీ, ఆక్సిజన్ లేకుండా బతకగలమా.? ఛాన్సే లేదు.
మన కడుపున పుట్టిన పిల్లలకు ఆస్తులు ఇవ్వాలనుకుంటాం.. కానీ, మంచి పర్యావరణాన్ని ఇవ్వాలని ఎందుకు అనుకోం.?
Environment Day Allu Arjun సెలబ్రిటీలు.. మొక్కలు నాటుట.!
ప్రముఖ సెలబ్రిటీలు మొక్కలు నాటుతుంటారు. అందరూ మొక్కలు నాటడాన్ని మంచి అలవాటుగా చేసుకోవాలని సూచిస్తుంటారు.
చూస్తున్నారు కదా.. ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ (Stylish Icon Star Allu Arjun) తన ఇంట్లో ఓ చిన్న మొక్కని నాటాడు. దానికి నీళ్ళు పోశాడు.! మంచి పనే ఇది.!

ఇంతకీ, సెలబ్రిటీలు చేస్తోన్న ఈ సూచల్ని ఎంతమంది అభిమానులు పాటిస్తున్నారట.?
మొక్కలు పీకెయ్యొద్దు..
నిజానికి, మొక్కలు (Environment Day) ప్రత్యేకంగా నాటాల్సిన పనిలేదు.! మనం చేయాల్సిందల్లా మొక్కలు పీకెయ్యకుండా వుండడం.
రోడ్లను విస్తరించాలంటే పెద్ద పెద్ద చెట్లను నరికెయ్యాలి.. జనం ఇళ్ళు కట్టుకోవాలన్నా పెద్ద పెద్ద చెట్లను తీసి పారెయ్యాలి.!
ఈ కాంక్రీట్ జంగిల్లో మొక్కలు నాటేందుకు తగిన స్థలం ఎక్కడ దొరుకుతోంది.?
అందుకే, పెరగాల్సిన అవగాహన.. మొక్కలను నాటడం గురించి మాత్రమే కాదు. వున్న చెట్లని నరికెయ్యకుండా కూడా అవగాహన (Mother Earth) కల్పించాలి.!
Also Read: Free Hindu Temple.! హిందూ దేవాలయాలకి రాజకీయ గ్రహణం.!
ముందే చెప్పుకున్నాం కదా.! మన వారసులకి మనం ఇవ్వాల్సింది ఆస్తిపాస్తులు కాదు.. చక్కటి పర్యావరణం.!
ఔను, ఆక్సిజన్ అనేది లేకపోతే.. మనిషి బతకలేడు. దాన్ని కోవిడ్ పాండమిక్ సమయంలో కొనుక్కోలేక ఎన్ని పాట్లు పడ్డామో తెలుసు కదా.?
మొక్కలు పెంచండి.! చెట్లను నరికెయ్యకుండా జాగ్రత్త పడండి.! సెలబ్రిటీలు చెప్పినా.. ఇంకెవరు చెప్పినా.. అది మంచి మాటే.! పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత.