Epic First Semester Baby.. ‘బేబీ’ కాంబినేషన్ రిపీట్ అవుతోంది.! ఈసారి హీరో, హీరోయిన్.. ఇద్దర్నీ విదేశాల్లో పరిచయం చేస్తున్నారు మేకర్స్.!
సినిమా పేరేమో ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’.! సితార బ్యానర్‌లో నిర్మాత నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఆదిత్య హాసన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. మేకర్స్, ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’ టైటిల్ గ్లింప్స్‌ని విడుదల చేశారు.
సినిమాలో హీరోయిన్ ఎలా వుంటుందో తెలుసా.? సందీప్ రెడ్డి వంగా సినిమాలోని హీరోలా.! మరి, హీరో ఎలా వుంటాడో తెలుసా.? శేఖర్ కమ్ముల సినిమాలో హీరోలా.!
Epic First Semester Baby.. మాస్టర్స్ కంప్లీట్ చేసిన హీరోయిన్..
శేఖర్ కమ్ముల సినిమాల్లోని హీరో చాలా సాఫ్ట్‌గా వుంటాడు. మరి, సందీప్ రెడ్డి వంగా సినిమాలోని హీరో ఎలా వుంటాడో తెలుసు కదా.?
‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’ సినిమాలో హీరో ఆనంద్ దేవరకొండ కాగా, హీరోయిన్ వైష్ణవి చైతన్య. అంటే, వైష్ణవి చైతన్యకి.. సందీప్ రెడ్డి వంగా సినిమాలోని హీరో క్యారెక్టర్ ఇచ్చారన్నమాట.
ఇక, అమెరికాలో మాస్టర్స్ చేసిన అమ్మాయి, ఓ సాధారణ కుర్రాడ్ని పటాయించే కాన్సెప్ట్.. అన్నట్లుంది వ్యవహారం. టైటిల్ గ్లింప్స్‌లో, పక్కా లోకల్ డ్రెస్సింగ్‌తో కనిపిస్తున్నాడు ఆనంద్ దేవరకొండ.

తన కోసం కాకుండా, తన తల్లి దండ్రుల కోసమే పెళ్ళి చేసుకోవాలనుకునే అమ్మాయి హీరోయిన్.
డ్రెస్ సెన్స్ వుండాలి, మ్యూజిక్ సెన్స్ వుండాలి.. ఇవీ, తనక్కాబోయేవాడికి వుండాల్సిన క్వాలిటీస్.. అని హీరోయిన్ చెబుతుంది.
లోకల్ అంటే, మరీ నాటుగా.. పంచె కట్టులో.! హీరోయిన్ వైష్ణవి చైతన్య, తనకు అస్సలు సూట్ కాని కర్లింగ్ హెయిర్‌తో కనిపిస్తోంది.!
వీరిద్దరి ప్రేమ కథ తెరపై ఎలా వుంటుందో తెలియాలంటే, సినిమా విడుదలయ్యేదాకా వేచి చూడాల్సిందే. ‘బేబీ’ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి నటిస్తున్న సినిమా ఇది.
‘బేబీ’ సినిమా వసూళ్ళ పరంగా సాధించిన విజయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.!
