మాహిష్మతీ ఊపిరి పీల్చుకో.. అంటూ ‘బాహుబలి’ సినిమాలో ఓ డైలాగుంటుంది.. అది ఎంత ఫేమస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఓ ‘బాహుబలి’ విషయంలో ఇప్పుడు ప్రపంచమూ ఊపిరి పీల్చుకుంటోంది. ఎవరి బాహుబలి.? (Ever Green Ever Given Ship Baahubali Suez Canal) ఏమా కథ.?
అదో పెద్ద ఓడ. సరుకు రవాణా నిమిత్తం తయారు చేసిన అతి పెద్ద ఓడ అది. దాని పేరు ఎవర్ గివెన్. ఎవర్ గ్రీన్.. (Ever Green Ever Given Ship) అనే పేరుతోనూ వ్యవహరిస్తున్నారు. అందులో సిబ్బంది మొత్తం భారతీయులే. ప్రపంచంలోనే అతి పెద్ద మానవ నిర్మిత ‘కాలువ’లో ఇరుక్కుపోయింది ఈ ‘బాహుబలి’ ఓడ.
Also Read: అంగారకుడిపై క్రికెట్.. ఇలా ఆడేస్తే సరి.!
ఆ భారీ నిర్మిత కాలువ పేరు సూయిజ్ (Suez Canal). చారిత్రక నేపథ్యమున్న ఈ కాలువ మీద ఒత్తిడి చాలా పెరుగుతోంది.. ఎప్పటికప్పుడు పెరుగుతున్న సరుకు రవాణా ఓడల సంఖ్య కారణంగా. దీన్ని విస్తరించే ప్రణాళికలున్నా.. వేగంగా జరగడంలేదంతే.
వేలాది కంటెయినర్లతో సూయిజ్ కెనాల్ దాటాల్సిన ఈ ఎవర్ గ్రీన్ – ఎవర్ గివెన్ ఓడ, ఇసుక తుపాన్ల ధాటికి.. కాలువకి అడ్డం తిరిగింది. అంతే, వందలాది సరుకు రవాణా ఓడలు ఈ మార్గంలో నిలిచిపోయాయి కొద్ది రోజులపాటు. ప్రపంచం స్తంభించిపోయిందనేలా చర్చ జరిగింది. నిజమే, రోజుకి వేల కోట్ల నష్టమంటే మాటలా.?
Also Read: సెకెండ్ వేవ్: నో మాస్క్! కరోనా వైరస్‌కి వెల్‌కమ్.!
సకాలంలో సరుకు రవాణా జరగక, కొన్ని దేశాలు సంక్షోభంలో కూరుకుపోతాయన్న ఆందోళనతో ప్రపంచ దేశాలన్నీ ఏకమయ్యాయి. ఎలాగైతేనేం, అందరి శ్రమా ఫలించింది. వారాల తరబడి, నెలల తరబడి దాన్ని బయటకు తీయలేరేమోనన్న ఆందోళనకి తెరపడేసరికి అంతా ఊపిరి పీల్చుకున్నారు.
అన్నట్టు, ఈ ‘బాహుబలి’ ఓడలో (Ever Green Ever Given Ship Baahubali Suez Canal) సిబ్బంది మొత్తం భారతీయులే కావడం గమనార్హం. గతంలోనూ పలు సందర్భాల్లో ఓడలిలా సూయిజ్ కాలువలో ఇరుక్కుపోయాయి. అయితే, ఇంతలా ప్రచారం జరిగింది మాత్రం ఈసారే. గతంలో ఏళ్ళ తరబడి, నెలల తరబడి రవాణా నిలిచిపోయిన సందర్భాలూ లేకపోలేదు.