Festival Punishment.. అప్పుడెప్పుడో తుగ్లక్ జనాన్ని పట్టి పీడించేశాడనీ.. ఆ తుగ్లక్ పాలన గురించి తరచూ మాట్లాడుకుంటుంటాం. బ్రిటీష్ పాలన గురించీ చర్చించుకుంటాం. పన్నులు, జరిమానాలూ ఇవన్నీ ఎవరి కోసం.? ఎందుకోసం.? ‘జనోద్ధారణ కోసమే.!’ ఖజానా నింపుకోవడం కోసమే. అదనపు ఛార్జీలు కూడా అందుకే.
సంక్రాంతి పండగ పేరు చెప్పి, ప్రత్యేక ట్రైన్లు, ప్రత్యేక బస్సులు.. అంటూ బాదేస్తున్నారు. చాలా కాలంగా నడుస్తోన్న తంతు ఇది. పండక్కి ఊరెళ్లడానికి ప్రయాణికులు పోటెత్తుతారు. ఇదే సందని అడ్డగోలుగా ప్రభుత్వాలు ప్రజల పండగ సరదాని క్యాష్ చేసుకుంటున్నాయ్. అదీ చాలక అదనపు జరిమానాలు కూడా విధించేస్తున్నాయ్.
ఇదో టైపు దోపిడీ.!
రైల్వే స్టేషన్లో రద్దీ తగ్గించడానికి ప్లాట్‌ఫామ్ టిక్కెట్ ధరలు పెంచేయడం ఆనవాయితీగా మారిపోయింది. రాజకీయ పార్టీల బహిరంగ సభలకి జనం రద్దీ వుండకుండా ఇలాంటి జరిమానాలేమైనా విధించగలరా.? అక్కడికి జనాన్ని బలవంతంగా రప్పిస్తారు. ఇక్కడికి జనం వెళితే వాయించేస్తారు ఇదీ రాజకీయం.

పండగలూ, పర్వదినాల్లో దేవాలయాలకు భక్తులు పోటెత్తడం మామూలే. కానీ, ఇప్పుడదో పెద్ద నేరంగా మారిపోతోంది. ప్రత్యేక దర్శనాలు, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనాల పేరుతో భక్తుల నుంచి అదనపు వసూళ్లకి పాల్పడుతున్నారు. వీటిని ‘భక్తి పన్ను’ అనాలా.? భక్తి పేరుతో ‘జరిమానా’ అనాలా.?
ఎదిరించేవాడు లేకపోతే, బెదిరించే వాడిదే పెత్తనం.. అన్నట్లు తయారైంది పరిస్థితి. పండగ అంటేనే జనం వెన్నులో వణుకు పుట్టేలా చేస్తున్నాయ్ పాలకుల చర్యలు. ఇక్కడ జనాల్ని కూడా నిందించాల్సిందేనేమో. ఎందుకంటే, చిన్న చిన్న విషయాలకు రాద్ధాంతం చేస్తారు. కానీ, పశ్నించాల్సిన సందర్భాల్లో మిన్నకుండిపోతున్నారు.
ఇస్మార్ట్.. డబుల్ డోస్.!
బహిరంగ ప్రదేశాల్లో స్మోకింగ్ నేరం. మద్యం సేవించి వాహనాలు నడపడమూ నేరమే. అలాంటప్పుడు ఈ రెండింటినీ బ్యాన్ చేసేయొచ్చు కదా. కానీ, బ్యాన్ చేయరు. ఎందుకంటే, అవి రెండు మార్గాల్లో ఆదాయాన్నిస్తాయ్. అమ్మకాలు, తద్వారా వచ్చే పన్నుల ఆదాయం. ఇంకోటి జరిమానాల వల్ల వచ్చే ఆదాయం. మీకర్ధమౌతోందా.?
Also Read: వెర్రి వెంగళప్పాయ్.! ఓటుకీ, సినిమా చూడ్డానికీ లింకేమిట్రా.?
చేసుకున్నోళ్లకి చేసుకున్నంత. ఇంతకీ ఇలా అదనపు పన్నులు, అదనపు వసూళ్లు ఏమౌపోతున్నాయ్.? ఎవరి జేబులోకి వెళ్లిపోతున్నాయ్.? అదో మిలియన్ డాలర్ల ప్రశ్న.