Fighter Aircraft Source Code.. అత్యాధునిక యుద్ధ విమానాలు.. ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ లేదా ఫైటర్ జెట్‌ల గురించిన చర్చ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతోంది.!
అమెరికా తన ‘ఎఫ్-35’ యుద్ధ విమానాల్ని అమ్మకానికి పెట్టింది. కానీ, షరతులు వర్తిస్తాయ్.! ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలతో అమెరికా యుద్ధాలు చేసేది, ఆయుధ వ్యాపారం కోసమే.
బలం తక్కువ వున్న దేశాల్ని, తన ఆయుధ శక్తితో భయపెట్టి, అంతర్జాతీయ మార్కెట్‌లో తమ ఆయుధాల్ని అమ్మకానికి పెడుతుంది అమెరికా.
రష్యా కూడా ఈ వ్యాపారంలో తనదైన ముద్ర వేసినా, అమెరికా తరహాలో, ఆధిపత్యం కోసం యుద్ధాలు చేయదు. ఇది అందరికీ తెలిసిన విషయమే.
Fighter Aircraft Source Code.. సోర్స్ కోడ్.. అనగానేమి.?
ఎఫ్-35 యుద్ధ విమానాల్ని భారత దేశానికి విక్రయిస్తామంటోంది అమెరికా. కానీ, ‘సోర్స్ కోడ్’ మాత్రం ఇవ్వదట.! అదే, రష్యాతో అయితే ఆ సమస్య లేదు.
రష్యా తయారీ ‘ఎస్‌యు-57’ యుద్ధ విమానం తయారీ ప్రాజెక్టులో తొలుత భారత దేశానికి చెందిన హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ భాగస్వామిగా వుండాలనుకుంది.

కానీ, అనివార్య కారణాల నుంచి, ‘హెచ్ఎఏల్’ ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. అదే యుద్ద విమానాన్ని భారత దేశానికి తక్కువ ధరకే విక్రయిస్తామని అంటోంది రష్యా.
భారత దేశంలోనే ‘ఎస్‌యూ-57’ యుద్ధ విమానాల్ని ‘హెచ్ఏఎల్’ తయారు చేసుకునేలా, లైసెన్స్ కూడా ఇస్తామని రష్యా ముందుకొచ్చింది. మరి, సోర్స్ కోడ్ సంగతేంటి.?
సోర్స్ కోడ్ అంటే, ‘డిజిటల్ బ్రెయిన్’ అన్నమాట. బ్రెయిన్ ఫంక్షన్.. పూర్తిస్థాయిలో జరగాలంటే, సోర్స్ కోడ్.. తప్పనిసరి.
సోర్స్ కోడ్ తమ వద్దనే వుంచుకుంటే..
యుద్ధ విమానం తయారీ, అత్యంత సంక్లిష్టమైనది. వేల కోట్ల ఖర్చు.. దానికి తోడు, బోల్డంత సమయం.. అపారమైన మేధో సంపత్తి.. ఇవన్నీ తప్పనిసరి.
అందుకే, ఏ దేశమైనా యుద్ధ విమానం తయారు చేసి, ఇతర దేశాలకు దాన్ని విక్రయించినా, ‘సోర్స్ కోడ్’ ఇవ్వడానికి ఇస్టపడదు.

కానీ, యుద్ధ రంగాన.. కీలకమైన సమయంలో, సోర్స్ కోడ్ ద్వారా, యుద్ధ విమానాన్ని ‘తయారీ దారు’ బ్లాక్ చేస్తే.? అంతే, సంగతులు.!
అదీ, సోర్స్ కోడ్ తాలూకు మ్యాజిక్కు.! ఈ కారణంగానే, ‘స్వయం తయారీ’ వైపు, భారత రక్షణ రంగం అడుగులు వేస్తోంది.
తప్పనిసరై, కొన్ని యుద్ధ విమానాల్ని తక్షణావసరాల నిమిత్తం కొనుగోలు చేసుకోవాల్సిందే. ఈ క్రమంలో కొన్ని వెసులుబాట్లను భారత్ పొందాలనుకుంటుంది.
Also Read: వెబ్..చారమ్: పాత్రికేయమంటే.! పక్కలెయ్యడమే..నా.?
ఆయా డీల్స్ ఆలస్యమవడం వెనుక అసలు కారణం కూడా ఇదే.! ఈ ఆలస్యంపై రకరకాల రాజకీయ విమర్శలు సర్వ సాధారణమేననుకోండి.. అది వేరే సంగతి.
అవును, సోర్స్ కోడ్.. అత్యంత కీలకం. మొత్తం విమానంలో అన్ని వ్యవస్థలూ ఈ ‘సోర్స్ కోడ్’ ఆధారంగానే పని చేస్తాయి. అందుకే, డిజిటల్ బ్రెయిన్ అంటారు.. యుద్ధ విమానాలకు సంబంధించి.
