AI Love You Movie.. ఇంజనీరింగ్ అంటే, కేవలం ‘ఏఐ, ఎంఎల్’ మాత్రమే.! కంప్యూటర్ సైన్స్‌లో ఈ బ్రాంచ్‌కి వున్న డిమాండ్ అంతా ఇంతా కాదు.
ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్.. ఇలా ఏ సోషల్ మీడియా యాప్ తిరగేసినా, అందులో బోల్డంత ‘ఏఐ’ కంటెంట్ కనిపిస్తోంది.!
నిజానికి, ‘ఏఐ’ కంటెంట్ అంటే, అందులో మళ్ళీ బూతు కంటెంట్‌కి వున్న డిమాండ్ అంతా ఇంతా కాదనుకోండి.. అది వేరే సంగతి.
అసలు విషయానికొస్తే, ‘ఏఐ’ ఆధారిత సినిమా ఒకటి వస్తోంది. అది కూడా, కన్నడ సినిమా కావడం గమనార్హం. ఇద్దరే వ్యక్తులు, ఓ సినిమాని పూర్తి చేసేశారు.
AI Love You Movie.. పది లక్షలతో పూర్తయిపోయిన ఏఐ సినిమా.!
అలా, సినిమా పూర్తి చేయడానికి అయిన ఖర్చు, జస్ట్ పది లక్షలు. ఆ పది లక్షలు ఖర్చయ్యింది, ‘ఏఐ’ యాప్స్ కోసమే కావడం మరో ఆసక్తికర అంశం.
హీరో, హీరోయిన్.. ఇలా అన్ని పాత్రల్నీ ఏఐ ద్వారానే క్రియేట్ చేశారు. కథ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, ఎడిటింగ్ కూడా.. ఏఐ టూల్స్‌తో చేసెయ్యడానికి వీలు పడుతోందిట.
మొదటి ‘ఏఐ’ సినిమా, చైనాలో నిర్మితమయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ సినీ పరిశ్రమల్లో, ఈ ‘ఐఏ సినిమాల’ మీద ఆసక్తి పెరుగుతోంది.
‘ఎక్స్‌ప్రెషన్స్’ విషయంలో సహజత్వం మాత్రం, ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో ఈ ‘ఏఐ’ సినిమాల నుంచి ఆశించడానికి వీల్లేదు. కానీ, ముందు ముందు.. అది కూడా సాధ్యపడొచ్చు.
సినిమా నిర్మాణం అంటే, ప్రస్తుతం వందల కోట్లు.. వేల కోట్లంటూ.. ప్రముఖ నిర్మాతలు చెబుతున్న పరిస్థితిని చూస్తున్నాం. ఇందులో స్టార్స్ రెమ్యునరేషనే అత్యధికం.
మరి, ఏఐ హీరోలు, హీరోయిన్లు వచ్చేస్తే.? అసలంటూ, దర్శకులతోనే పని లేకపోతే.? సినిమా పట్ల కనీస అవగాహన లేని వ్యక్తి కూడా, ‘ఏఐ’ ఆధారిత సినిమాలు తెరకెక్కించేస్తే.?
మనం త్రీడీ మూవీస్ చూస్తుంటాం.. గ్రాఫిక్స్ నేపథ్యంలో తెరకెక్కుతుంటాయ్ చాలావరకు. అందులోని బొమ్మల్ని, నిజ జీవితంలో వ్యక్తులు లేదా, జంతువుల్ని పోలి వుండేలా తీర్చిదిద్దుతారు.
‘జురాసిక్ పార్క్’ సినిమాల్నే తీసుకుంటే, అవి నిజమైన డైనోసార్లనే అనుకుంటాం. మన తెలుగు సినిమాల్లోనూ, గ్రాఫిక్స్ నేపథ్యంలో చాలా సినిమాలొచ్చాయి.
అయితే, గ్రాఫిక్స్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని. కోట్లాది రూపాయలు.. ఆ విజువల్ ఎపెక్ట్స్ కోసం ఖర్చుచేయాల్సి వస్తోంది. ఇంతా చేసినా, కొన్ని సార్లు అది బెడిసి కొడుతుంటుంది.
‘ఏఐ’తో అలాంటి సమస్య వుండదని నిపుణులు చెబుతుండడం గమనార్హం.
హీరోలు, హీరోయిన్లకు డూపుల గురించి వింటుంటాంగానీ.. ఇకపై డూపులతో పని లేదు, అసలు హీరో హీరోయిన్లోనూ పని లేదు. భవిష్యత్ అంతా ‘ఏఐ’ సినిమాలదేనని అనుకోవచ్చా.?
క్యారవాన్లతో పని లేదు, ఖరీదైన సెట్స్ వేయాల్సిన అవసరం అసలే లేదు. ‘ఎఐ’ వుంటే, అన్నీ చేతిలో వున్నట్టే. డైలాగులు కూడా ‘ఏఐ’నే రాసేస్తుంది. స్క్రీన్ ప్లే కూడా.. అదే చూసుకుంటుంది.
అన్నట్టు, కన్నడ ఏఐ సినిమా పేరు చెప్పలేదు కదా.. ‘లవ్ యూ’ అట.! ఇంతకీ, ‘ఏఐ’ సినిమా పూర్తిగా అందుబాటులోకి వచ్చేస్తే, సినీ కార్మికుల పరిస్థితేంటి.? ఖేల్ ఖతం దుకాణ్ బంద్.!