Film Maker Parannajeevi.. నా కథలో పాత్రలన్నీ కల్పితం.. అంటాడు. తీసేవన్నీ చరిత్రకి సంబంధించినవే.. చరిత్రలోని వ్యక్తుల జీవితాల్ని పోలినవే. అచ్చం ఆ చరిత్రలోని వ్యక్తుల్లాంటి నటుల్ని తీసుకొస్తాడు. చరిత్రని వక్రీకరిస్తాడు. ఏందీ అరాచకం.? అని ప్రశ్నిస్తే, ‘అంతా నా ఇష్టం’ అంటాడు.
మందు, మగువ, మనీ.. వీటికి తోడు దెయ్యాలూ.. అన్నింటికీ మించి ఒళ్లంతా విషం. కొందరిపై అర్ధం పర్ధం లేని కడుపు మంట. వీటన్నింటికీ ఓ రూపం వుంటే, అదే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నపరాన్నజీవి అవుతుంది.
Film Maker Parannajeevi .. పరాన్నజీవి పైత్యానికి కాదేదీ అనర్హం
బెజవాడ ముఠా కక్షల దగ్గర్నుంచి, రాయలసీమ ఫ్యాక్షన్ వరకూ.. అంతేనా.! ఈ పైత్యం ఇప్పుడు తెలంగాణా దాకా పాకేసింది. ఇందుగలడందులేడని సందేహం వలదు.. అన్నట్లుగా ఎక్కడైనా వాలిపోతాడు. ఎవరి అవసరాల్ని అయినా తీరుస్తాడు. ఎవరి మీదైనా విద్వేషం చిమ్మగలడు. తనకు పేరు తెచ్చిన కళకే మచ్చ తెచ్చిన మూర్ఖుడు.
తమ పేరు ప్రఖ్యాతలు పెంచుకోవడం కోసమో, ఎదుటి వారి స్థాయి తగ్గించడం కోసమో.. ఏం చేయడానికైనా సిద్ధపడే కొన్ని అసాంఘిక శక్తులకి ఈ పరాన్న జీవి బెస్ట్ ఆప్షన్.
సంచలనం చచ్చింది.. విద్వేషం పెరిగింది.!
ఒకప్పటి ఆ సంచలనం ఇన్నేళ్లూ ఈ పరాన్నజీవిని ఇంకా నడిపిస్తోందా.? లేదు. సంచలనం కాలగర్భంలో కలిసిపోయి, వివాదం కూడా బోర్ కొట్టేసి, వికృతంగా మారిపోయి, పైశాచికత్వం ప్రదర్శిస్తోంది. వ్యక్తుల మీదా, వ్యవస్థల మీదా దాడి చేస్తూ నవ్విపోదురు గాక.. నాకేటి సిగ్గు.. అన్నచందాన వికటాట్టహాసం చేస్తోంది.
Also Read: చిక్కు ప్రశ్న.. అనసూయ భరద్వాజ్‌ని ఏమని పిలవాలి.?
వచ్చాయ్.. వస్తాయ్.. వస్తూనే వుంటాయ్.. సినిమాలు కావవి. ఆత్మకథలూ కావవి. పరాన్నజీవి ప్రేతాత్మ కథలు. ఎవరితో పోల్చినా, ఎంత హీనమైన వాడితో పోల్చినా వీడ్ని చూసి ఆ పోలిక తమకెందుకు పెట్టారని వాపోతాయ్.
ఇంతకన్నా పతనావస్థ ఇంకేముందని అందరూ ముక్కున వేలేసుకునే లోపు.. అంతకన్నా ఇంకాస్త లోతుకి దిగజారిపోతుంటాడు ఈ పరాన్నజీవి.
