Game Changer Rafale Aircraft.. భారత వైమానిక దళానికి సంబంధించినంతవరకు రఫేల్ యుద్ధ విమానాన్ని ‘గేమ్ ఛేంజర్’గా అభివర్ణిస్తుంటారు రక్షణ రంగ నిపుణులు.!
అందుకే, రఫేల్ యుద్ధ విమానాల డీల్ విషయమై అంత చర్చ జరిగింది. వందకు పైగా రఫేల్ యుద్ధ విమానాల్ని సేకరించాలని తొలుత భావించారు.
అయితే, రఫేల్ యుద్ధ విమానాలతోపాటుగా, దానికి సంబంధించిన ఆయుధ వ్యవస్థలు అత్యంత కీలకం కావడంతో, డీల్‌లో పలు మార్పులు జరిగాయి.
అన్ని ఆయుధ వ్యవస్థలూ కలిగిన (రఫేల్ యుద్ధ విమానాల కోసమే డిజైన్ చేసిన కొన్ని మిస్సైళ్ళు, ఇతర బాంబులు) రఫేల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ రాకతో, భారత వైమానిక దళం కనీ వినీ ఎరుగని స్థాయిలో బలోపేతమయ్యింది.
Game Changer Rafale Aircraft.. పుల్వామా నుంచి పహల్గామ్ వరకు..
పుల్వామా టెర్రర్ ఎటాక్, ఈ నేపథ్యంలో జరిగిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ సందర్భంగా, ‘రఫేల్’ ఎంత అవసరమన్నదానిపై మరింత స్పష్టత వచ్చింది.
చేతిలో రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్ అప్పటికే వుండి వుంటే, పరిస్థితి అంతకు మించి.. వుండేదని అప్పట్లో రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడిన సంగతి తెలిసిందే.
ఇప్పుడైతే, 36 రఫేల్ యుద్ధ విమానాలు భారత వైమానిక దళ అమ్ముల పొదిలో వున్నాయ్. పహల్గామ్ ఎటాక్ తర్వాత ‘ఆపరేషన్ సిందూర్’లో కీలక పాత్ర పోషించింది రఫేల్.. అన్న ప్రచారం జరుగుతోంది.
శతృవు భూభాగంలోకి వెళ్ళకుండానే, మన భూభాగం నుంచే, రఫేల్ యుద్ధ విమానం ద్వారా సుదూరంలోని లక్ష్యాల్ని ఛేదించగలిగే అవకాశం దక్కిందన్నది రక్షణ రంగ నిపుణులు చెబుతున్నమాట.
పాకిస్తాన్ పక్కలో బల్లెమే..
నిజానికి, ఇది ఇక్కడితో అయిపోయే వ్యవహారం కాదు. పాకిస్తాన్ ఎప్పుడూ పక్కలో బల్లెమే మనకి.! దానికి తోడు చైనాతో పొంచి వున్న ముప్పు నేపథ్యంలో, రఫేల్ లాంటి యుద్ధ విమానాలు మరిన్ని అవసరం.
నావికా దళానికి సంబంధించిన వేరియంట్ ‘రఫేల్’ కూడా త్వరలో అందుబాటులోకి రానుంది. భారత తయారీ యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ మీద వీటిని మోహరిస్తారు.
విక్రాంత్ విమాన వాహక నౌకతోపాటుగా, ఐఎన్ఎస్ విక్రమాదిత్యపైనా, రఫేల్ నేవీ వేరియంట్స్ వినియోగించే అవకాశం వుంది.
Also Read: గుడిసేటి మాటలెందుకు? గుడి మెట్లు కడిగి చూడు ప్రకాష్ రాజ్!
మరోపక్క, స్వదేశీ తయారీ.. మరో భారీ విమాన వాహక నౌకను నిర్మించ తలపెట్టింది భారత నౌకాదళం. అణు ఇంధనంతో నడిచేలా దీన్ని డిజైన్ చేస్తున్నారు. దీనికీ, రఫేల్ అవసరమవుతుంది.
ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రఫేల్ యుద్ధ విమానాలు ఓ వైపు, స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసుకుంటున్న యుద్ధ విమానాలు ఇంకో వైపు.. వెరసి, రానున్న రోజుల్లో.. ‘ఎయిర్ సుపీరియారిటీ’ వేరే లెవల్లో వుండబోతోంది.
మొత్తమ్మీద, ఇప్పటికిప్పుడు రఫేల్ యుద్ధ విమానాలు, యుద్ధ రంగంలో భారతదేశానికి ‘గేమ్ ఛేంజర్’ అని నిస్సందేహంగా చెప్పొచ్చు.