Game Changer Song Leak.. దొంగని అర్జంటుగా పట్టుకోవాలిప్పుడు.! కానీ, ఎవరు ఆ దొంగ.? పట్టుకోవడం సాధ్యమేనా.? ఇంతకీ, ఏం దొంగతనం జరిగింది.?
ఎవరో పాటని దొంగిలించారు. పాటని దొంగిలించడమేంటి.? నిజంగానే దొంగిలించారు. ఎవరి ప్రాపర్టీ అది.? ఇంకెవరిది.. ప్రముఖ నిర్మాత దిల్ రాజుది.
దిల్ రాజు (Dil Raju) నిర్మిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా నుంచి ఓ ఆడియో సాంగ్ లీక్ అయ్యింది. అదీ అసలు సంగతి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), స్టన్నింగ్ బ్యూటీ కైరా అద్వానీ (Kiara Advani) జంటగా నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాకి శంకర్ దర్శకుడు.
Game Changer Song Leak.. శంకర్ భద్రతా వలయాన్ని ఛేదించుకుని.?
ప్రముఖ దర్శకుడు శంకర్, ఏదన్నా సినిమా తెరకెక్కిస్తున్నాడంటే, భద్రత మామూలుగా వుండదు.! ఆయన అనుమతి లేకుండా ఈగ కూడా షూటింగ్ స్పాట్‌కి రావడానికి వీల్లేదన్నట్లు పరిస్థితులు వుంటాయ్.
అలాంటిది, ఏకంగా ఓ ఆడియో సాంగ్ ఎలా లీక్ అయిపోతుందబ్బా.? ఎక్కడో ఏదో తేడా జరిగింది. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడన్నట్టు.. ఇది నిజంగానే ఇంటి దొంగ పని.
అయితే, ఈ తరహా లీకులు సినీ పరిశ్రమకు కొత్త కాదు. ‘అత్తారింటికి దారేది’ సినిమా అయితే, విడుదలకు ముందే లీక్ అయిపోయింది.
‘బాహుబలి’ సినిమా నుంచి కూడా కొన్ని సీన్స్ లీక్ అయిపోయిన సంగతి తెలిసిందే. చెప్పుకుంటూ పోతే, ఈ లీకుల కథ.. చాలా చాలా పెద్దది.
లీకులు అరెస్టులు.. ఇదో ప్రసహనం..
చాలా అరుదుగా ఈ తరహా లీకుల ఘటనల్లో అరెస్టులు జరుగుతుంటాయ్. ఆ తర్వాత సరామామూలే. ఎక్కువ శాతం ఎడిటింగ్ టేబుల్ నుంచే లీకులు అవుతుంటాయ్.
Also Read: సలారూ.! నిన్ను ఎందుకు వెనక్కి నెట్టేశారూ.!
మరి, ‘గేమ్ ఛేంజర్’ లీక్ విషయంలో తప్పెవరిది.? ఎవరి నిర్లక్ష్యం వల్ల ఈ లీకు చోటు చేసుకుంది.? పోలీసులకు ఫిర్యాదు చేసింది చిత్ర యూనిట్. దొంగ ఎవడో ఖచ్చితంగా దొరుకుతాడు.
కానీ, అసలు అది ఆ సినిమాకి సంబంధించింది కాదని అందరూ లైట్ తీసుకున్నాక, ‘లీక్’ అంటూ పోలీసుల్ని చిత్ర నిర్మాణ సంస్థ ఆశ్రయించడమేంటో.!