Gandeevadhari Arjuna Budget.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘గాండీవధారి అర్జున’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న సంగతి తెలిసిందే.
ఈ ‘గాండీవధారి అర్జున’లో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ సాక్షి వైద్య (Sakshi Vaidya) నటించింది. గతంలో ఆమె ‘ఏజెంట్’ సినిమాలో అక్కినేని అఖిల్‌తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసిన సంగతి తెలిసిందే.
‘గాండీవధారి అర్జున’ (Gandeevadhari Arjuna) సినిమాకి ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వం వహించాడు.
Gandeevadhari Arjuna Budget.. బడ్జెట్ ఎంత.?
‘గాండీవధారి అర్జున’ సినిమాకి చేసిన ఖర్చెంత.? ఈ విషయమై దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
సినిమాకి (Gandevadhari Arjuna) 56 కోట్లు బడ్జెట్ అయ్యిందట కదా.? అని ప్రశ్నిస్తే, ‘56 కోట్లు కాదు..’ అని దర్శకుడు ప్రవీణ్ సత్తారు తేల్చి చెప్పాడు.

‘మేం అలాగే రాశాం కదా..’ అని ఓ సినీ జర్నలిస్టు ప్రశ్నిస్తే, ‘మీరు రాసుకుంటే అయిపోతుందా.?’ అని నిలదీశాడు ప్రవీణ్ సత్తారు.
‘50 కాదు, 156 కోట్లు అని రాసి వుండాల్సింది..’ అని ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru), సదరు సినీ జర్నలిస్టు మీద సెటైర్ వేయడం గమనార్హం.
గొడవల సంగతేంటి.?
నిర్మాతతో గొడవలట.. ఎవర్నో కొట్టారట.. అని ప్రశ్నిస్తే, ‘ఏకంగా కొట్టేయడమే.? అలాంటివి జరుగుతాయా అసలు.? గొడవ జరిగిందని అంటున్నారు కాబట్టి, అవతలి వ్యక్తిని అడిగితే తెలిసిపోతుంది కదా..’ అంటూ ప్రవీణ్ సత్తారు సదరు జర్నలిస్టుపై మండిపడ్డాడు.
Also Read: ఎవరీ లోలిత.! ఎందుకీ రెస్ట్ ఇన్ పీస్.?
ఇంతకీ, ‘గాండీవధార అర్జున’ బడ్జెట్ ఎంత.? అంటే, పరిమితులకు లోబడి ఖర్చు చేశామనీ, క్వాలిటీ విషయంలో రాజీ పడలేదనీ ప్రవీణ్ సత్తారు చెప్పడం గమనార్హం.
ఈ మధ్య సినీ ప్రముఖులు కనిపిస్తే చాలు, అడ్డగోలు ప్రశ్నలతో విసిగించడం, కొందరు సినీ ‘ఎర్నలిస్టుల’కి అలవాటైపోయింది.
సినిమా జర్నలిజం అంటే, జస్ట్ బ్లాక్మెయిల్ ఎర్నలిజం అయిపోయింది కొందరికి.!