Table of Contents
YSRCP Political Unmaadam.. ఉన్మాదానికి రాజకీయం తోడైతే.? ఇదిగో ఇలా వుంటుంది.! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, చేస్తున్న ఉన్మాద రాజకీయాలు.. అత్యంత భయానకంగా తయారవుతున్నాయి.
ఎవరో, ఒకరిద్దరు అత్యుత్సాహం చూపిస్తే, దాన్ని ఓ రాజకీయ పార్టీకి అంటగట్టడం సబబా.? అంటే, వారిని అదుపు చేయాల్సిన బాధ్యత ఆయా పార్టీలదే కదా.?
వైసీపీ హయాంలో, టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై దాడికి యత్నించారు కొందరు వైసీపీ ప్రజా ప్రతినిథులు, తమ అనుచరుల్ని వెంటేసుకుని.
స్థానిక ఎన్నికల సమయంలో, వైసీపీ నేతలు అలాగే కార్యకర్తలు.. ప్రత్యర్థి రాజకీయ నాయకుల్ని హతమార్చేందుకు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు.
రక్త సిక్తమయ్యాయి స్థానిక ఎన్నికలు వైసీపీ హయాంలో. ఇతర రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు, నామినేషన్లు వేయడానికే భయపడ్డారు.
YSRCP Political Unmaadam.. అప్పుడూ.. ఇప్పుడూ.. ఉన్మాదమే..
ప్రభుత్వం మారింది.. కూటమి అధికారంలోకి వచ్చింది. అయినా, వైసీపీ ఉన్మాదుల తీరు అలానే వుంది. ‘2029లో గెలిచి, రప్పా రప్పా నరుకుతాం’ అంటూ ఉన్మాదాన్ని చాటుకుంటున్నారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు పర్యటన సందర్భంగా వైసీపీ కార్యకర్తలు ప్రదర్శించిన అత్యుత్సాహమిది. ఇలాంటివాటిని ఏ రాజకీయ పార్టీ కూడా సమర్థించకూడదు.
‘వాళ్ళతో పార్టీకి సంబంధం లేదు. హత్యా రాజకీయాల్ని మేం సమర్థించం..’ అని ఈపాటికే వైసీపీ ప్రకటన చేసి వుండాలి.. చేయడంలేదంటే, వైసీపీ అధినాయకత్వమే ఇవన్నీ చేస్తోందని అనుకోవాలి.
అయినా, ఎవర్ని నరుకుతారు.? ‘రప్పా రప్పా నరుకుతాం’ అని ఎవర్ని బెదిరిస్తున్నారు.? ఇది ప్రజాస్వామ్యం.. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు.
ప్రజాస్వామ్య భారత దేశంలో రాజా రెడ్డి రాజ్యాంగమా.?
‘రాజా రెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచి మొదలైంది’ అంటూ బ్యానర్లు వెలిశాయ్. అంటే, భారత రాజ్యాంగాన్ని వైసీపీ కార్యకర్తలు అవమానిస్తున్నట్లే కదా.?
భారత రాజ్యాంగాన్ని పాటించకపోతే, భారత దేశంలో వుండటానికే అర్హులు కాదు. ఇలాంటివాళ్ళు వుంటే జైల్లో వుండాలి.. లేదంటే, దేశం వెలుపలే వుండాలి.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెట్రేగిపోతున్న ఉన్మాద రాజకీయంపై ఉక్కుపాదం మోపాలి.
ఎవర్ని నరుకుతారు.? ఎందుకు నరుకుతారు.?
అదే సమయంలో, కేంద్ర ఎన్నికల సంఘం కూడా, వైసీపీ ఉన్మాద రాజకీయంపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వుంటుంది. లేకపోతే, రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా బతికి బట్టకట్టే పరిస్థితి వుండదు.
Also Read: అమరావతి మహిళలపై ‘నీలి’ పాత్రికేయ వ్యభిచారమ్.!
రాక్షస పాలన తీసుకొస్తాం.. అని బహిరంగంగా బెదిరింపులకు దిగే స్థాయికి వెళ్ళిపోయారంటే.. ఇది ముమ్మాటికీ ఉన్మాదమే.!
అయిదేళ్ళు అధికారం వెలగబెట్టిన వైసీపీ, ‘రప్పా రప్పా నరుకుతాం’ అంటూ ఎవర్ని బెదిరిస్తున్నట్లు.? 2024 ఎన్నికల్లో తమకు ఓట్లేయని ప్రజల్ని నరుకుతారా.? ఏం రాజకీయమిది.?