Gandeevadhari Arjuna Review.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘గాండీవధారి అర్జున’ సినిమా కథా కమామిషు ఏంటి.?
సినిమా రిలీజ్‌కి ముందే, ఓ సెక్షన్ సినీ మీడియా ఈ సినిమాపై నెగెటివిటీని తెరపైకి తెచ్చింది.!
దర్శకుడికీ, యూనిట్ సభ్యులకీ మధ్యన గొడవ జరిగిందట.. కొట్టుకునేదాకా వెళ్ళారంట.. అని ఓ ఇంటర్వ్యూలో తనకెదురైన ప్రశ్నకి, లాగి గూబ మీద కొట్టినట్లు సమాధానం చెప్పాడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు.
సినిమా బడ్జెట్ విషయంలో జరిగిన దుష్ప్రచారానికీ తనదైన స్టయిల్లో దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఘాటైన సమాధానమిచ్చాడు.
వీటి ఫలితమే, సినిమా రిలీజ్‌కి ముందే ‘డిజాస్టర్’ అంటూ క్లోజింగ్ లెక్కల్ని ఓ సెక్షన్ మీడియా ప్రచారంలోకి తీసుకురావడం.!
ఇంతకీ, సినిమా ఎలా వుంది.? థియేటర్లలో ఆడియన్స్ రెస్పాన్స్ ఏంటి.?
Gandeevadhari Arjuna Review.. తడబడ్డాడు మెగా ప్రిన్స్.. ఇంకోస్సారి.!
కంటెంటు.. కటౌటూ.. రెండూ వున్నాడే.! కానీ, కథల ఎంపికలో తడబడుతున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.! సినిమా కోసం అవసరమైనదానికంటే ఎక్కువ కష్టపడుతున్నాడాయన.
ఈ సినిమాకీ, అంతకు మించి కష్టపడ్డాడు వరుణ్ తేజ్. కానీ, ఏం లాభం.? కథ, కథనం.. రెండూ వీక్‌గానే వున్నాయ్.! కొన్ని సన్నివేశాలు బాగున్నా, చాలా సన్నివేశాలు పరమ వీక్‌గా వున్నాయ్.
మెడికల్ వేస్ట్ చుట్టూ గతంలోనూ సినిమాలొచ్చాయ్. ఇందులో కొత్తదనం ఏముంది.? ఏమీ లేదు. హీరోయిన్ సాక్షి వైద్య (Sakshi Vaidya) క్యారెక్టర్ సినిమా అంతా వుంది దాదాపుగా.. కానీ, దండగ.!

విలన్ క్యారెక్టర్‌ని వీక్ చేసేసినప్పుడు, ఎంత స్టైలిష్‌గా యాక్షన్ బ్లాక్స్ డిజైన్ చేసి ఏం లాభం.? కథ ముందుకు సాగనప్పుడు, ఎంత అందమైన ప్రాంతాల్లో రిచ్‌గా చిత్రీకరిస్తే ఏం ఉపయోగం.?
వాట్ నాట్.. సినిమాలో చాలా మైనస్సులున్నాయ్. సినిమాటోగ్రఫీ చాలా బావుందనీ, వరుణ్ తేజ్ చాలా బాగా చేశాడనీ.. చెప్పుకోవడం వల్ల సినిమాకి ఉపయోగం ఏమీ వుండదు.
ఏదీ కంటెంట్.?
కంటెంట్ వున్న సినిమాలు తీస్తాడనే పేరున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru), కంటెంట్ పరమ వీక్‌గా వున్న సినిమాలు తీస్తున్నాడు ఈ మధ్య.
సాంకేతికంగా పట్టున్నా, తెరపై ఉత్కంఠగా కథని నడపలేకపోతున్నాడు ప్రవీణ్ సత్తారు. అది ఈ సినిమాతో ఇంకోసారి నిరూపితమయ్యింది.
నాజర్ లాంటి సీనియర్ నటుడు తన అనుభవాన్ని రంగరించే ప్రయత్నం చేసినా, ఆ పాత్ర కూడా సరిగ్గా పండలేదంటే, తప్పెవరిది.?
Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. పవన్ కళ్యాణ్ సరసన సాక్షి వైద్య.!
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఓకే.! ఇంకా ఎఫెక్టివ్‌గా వుండాల్సింది. అయినాగానీ, కథ అలాగే కథనాల్లో విషయం లేనప్పుడు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎంత బాగున్నా అదనపు లాభం ఏముంటుంది.?
వున్నపళంగా వరుణ్, కథల ఎంపిక విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరాన్ని ఈ ‘గాండీవధార అర్జున’ సినిమా చెప్పకనే చెబుతుంది.
సినిమాని ఎలాగైనా తొక్కేయాలని కొన్ని గుంట నక్కలు కాచుక్కూర్చున్న దరిమిలా, ఆ గుంట నక్కల అంచనాలు నిజమేనని నిరూపించడం కోసమే ఈ తరహా సినిమాలు తీస్తున్నటుంది కొందరు ఫిలిం మేకర్స్.!