బిగ్ హౌస్ (Bigg Boss Telugu 4) నుంచి ‘స్పెషల్ కంటెస్టెంట్’ గంగవ్వ (Gangavva The Bigg Winner) ‘ఔట్’ అయిపోయింది. ఈ సీజన్‌లో నిజంగానే గంగవ్వ వెరీ వెరీ స్పెషల్ కంటెస్టెంట్. నిజానికి, కరోనా పాండమిక్ నేపథ్యలో గంగవ్వని బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా ఎంపిక చేయడం పెద్ద సాహసం. దానికి తోడు, ఆమె ఇన్ని రోజులు హౌస్‌లో వుండడం ఇంకో అద్భుతం.
ఇంటి మీద బెంగ లేకుండా గంగవ్వ ఐదు వారాలు ముగిసేదాకా బిగ్ హౌస్‌లో (Bigg Boss 4 Telugu) వుందంటే ఇది ఆషామాషీ వ్యవహారం కాదు. బిగ్ హౌస్‌లో పలువురు కంటెస్టెంట్స్‌తో ‘స్పెషల్ బాండ్’ ఏర్పరచుకుంది గంగవ్వ. ఆడి పాడింది.. బోల్డంత సందడి చేసింది. ఈ వయసులో గంగవ్వ హుషారు చూసి ఎవరైనా ఇన్‌స్పైర్ అవ్వాల్సిందే.
యూ ట్యూబ్‌లో సెన్సేషన్ అయిన గంగవ్వ (Gangavva), బిగ్ హౌస్ ద్వారా మరింత సెన్సేషన్ అయ్యింది. ఆ మాటకొస్తే బిగ్ బాస్ వల్ల గంగవ్వకి అదనపు ప్రయోజనమేమీ లేదు.. కానీ, గంగవ్వ కారణంగా బిగ్ బాస్‌కి బోల్డంత మైలేజీ వచ్చింది.
ఫ్యామిలీ ఆడియన్స్, మరీ ముఖ్యంగా వృద్ధులు బిగ్ బాస్ షోకి కనెక్ట్ అయ్యారంటే అదంతా గంగవ్వ చలవే. ఎట్టకేలకు గంగవ్వని హౌస్ నుంచి బయటకు వంపారు. ‘ఇక నేనుండలేను మొర్రో..’ అని గంగవ్వ (Gangavva The Big Winner) వేడుకోవడంతో, ఆమె విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించి, ఆమెను హౌస్ నుంచి బయటకు తీసుకొచ్చారు.
అయితే, తెరవెనుక పెద్ద కథే నడిచిందంటూ ఓ ప్రచారం గట్టిగా జరుగుతోంది. అదేంటంటే, ముందస్తుగానే గంగవ్వను (Gangavva Eviction) హౌస్‌లో ఐదు వారాలు వుంచాలనే అగ్రిమెంట్ జరిగిందనీ, ఆ ప్రకారమే ఆమె ఐదు వారాలు హౌస్‌లో వుందనీ, అగ్రిమెంట్ మేరకు గంగవ్వను బయటకు పంపేసి.. దానికి బోల్డంత ‘సెంటిమెంట్’ పూసేశారని. ఇది నిజమేనా.? అన్నది వేరే చర్చ.
ఇన్ని వారాలో హౌస్‌లో గంగవ్వ వుండడానికి బిగ్‌బాస్ పూర్తిగా ‘సహకరించిన’ మాట వాస్తవం. ఫిజికల్ టాస్క్‌లకు ఆమెను దూరంగా వుంచారు. నామినేషన్స్ సమయంలోనూ ఆమెను కంటెస్టెంట్స్ ద్వారా ‘స్పెషల్’గా పరిగణించేలా చేశారు. అవన్నీ పక్కన పెడితే, గంగవ్వ ఓ సంచలనం. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. బిగ్ హౌస్ నుంచి ఆమె బయటకు వచ్చేసినా, ఈ సీజన్ వరకూ ఆమెనే విన్నర్. ఎనీ డౌట్స్.?