Table of Contents
Deepika Padukone PSB.. బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనె కొత్త ప్రయాణం షురూ చేసింది. నటించడం, సినిమాలు నిర్మించడం.. ఇవే కాదు, దీపికలో ఇంకో కోణం కూడా వుంది.
దీపిక తండ్రి ప్రకాష్ పదుకొనె, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. భారత దేశం తరఫున ప్రాతినిథ్యం వహించారు. అర్జున పురస్కారం కూడా ఆయనకు లభించింది. అంతేనా, పద్మశ్రీ పురస్కారం కూడా వరించింది.
ఇంకా ఆసక్తికరమైన విషయమేంటంటే, దీపిక పదుకొనే కూడా, బ్యాడ్మింటన్ ప్లేయర్. నేషనల్ లెవల్‌లో బ్యాడ్మింటన్ ఆడింది.. అదీ, సినీ నటి కాకముందు.
Deepika Padukone PSB.. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి..
అయితే, బ్యాడ్మింటన్‌కి గుడ్ బై చెప్పి, మోడలింగ్ వైపు అడుగులేసింది దీపిక పదుకొనే. మోడలింగ్ నుంచి సినిమా రంగంలోకి వచ్చిన దీపిక, కన్నడలో తొలి సినిమా చేసింది.
తెలుగులో అక్కినేని నాగార్జున నటించిన ‘మన్మథుడు’ కన్నడ రీమేక్‌లో ఉపేంద్ర సరసన దీపిక నటించింది. అదే, ఆమెకు తొలి సినిమా.
బాలీవుడ్‌లో షారుక్ సరసన ‘ఓం శాంతి ఓం’ దీపికకి హిందీలో తొలి సినిమా. ఆ సినిమా తర్వాత దీపిక పదుకొనేకి తిరుగులేని స్టార్‌డమ్ వచ్చిందనుకోండి.. అది వేరే సంగతి.
తండ్రి కోసం.. సరికొత్త ప్రయాణం..
తన తండ్రి ప్రకాష్ పదుకొనే ఆలోచనలకు అనుగుణంగా పదుకొనే స్కూల్ ఆఫ్ బిజినెస్‌ని ప్రారంభిస్తున్నట్లు దీపిక పదుకొనే వెల్లడించింది.
పదుకొనే స్కూల్ ఆఫ్ బిజినెస్ వ్యవహారలకు సంబంధించి దీపిక తండ్రి ప్రకాష్ పదుకొనే సలహాదారుగా వ్యవహరిస్తారట.
బ్యాడ్మింటన్ అనేది ఆరోగ్యం, క్రమశిక్షణను ఇస్తుందనేది దీపిక పదుకొనే అభిప్రాయం. అది నిజం కూడా.
అటు స్కూలు.. ఇటు సినిమాలు..
బ్యాడ్మింటన్ రంగంలో క్రీడాకారుల్ని ప్రోత్సహించడం, చిన్న వయసు నుంచే బ్యాడ్మింటన్ పట్ల ఆసక్తి పెంచడం.. ఇలా మంచి ఆలోచనతో, ఈ బ్యాడ్మింటన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రారంభించారట.
యధాతథంగా తాను సినిమా కెరీర్‌ని కొనసాగిస్తానని దీపికా పదుకొనే చెబుతోంది.
Also Read: టూరిస్ట్ ఫ్యామిలీ రివ్యూ: ‘అక్రమ వలస’ని ఎలా ఒప్పుకుంటాం.?
తాను కూడా, ఖాళీ సమయాల్లో, పదుకొనే స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో బ్యాడ్మింటన్ ఆడతాననీ, నేర్చుకుంటాననీ, నేర్పుతాననీ అంటోంది దీపిక.
సినిమాల విషయానికొస్తే, అల్లు అర్జున్ సరసన అట్లీ దర్శకత్వంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటిస్తున్న విషయం విదితమే.