Home » గరివిడి లక్ష్మి.! ఆ ముగ్గురికీ ఆ అదృష్టం దక్కలేదు.!

గరివిడి లక్ష్మి.! ఆ ముగ్గురికీ ఆ అదృష్టం దక్కలేదు.!

by Mudra369 Editorial Desk
0 comments
Sai Pallavi Nithya Menen Nivetha Thomas

Garividi Lakshmi Three Heroines.. బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో తెలుగమ్మాయ్ ఆనంది అత్యద్భుతంగా జీవించేసింది. సినిమాకి మంచి విజయం కూడా దక్కింది.!

‘గరివిడి లక్ష్మి’ బయోపిక్‌లో లీడ్ రోల్ చేసిన ఆనందికి నటిగా విమర్శకుల ప్రశంసలూ దక్కుతున్నాయి. ముందు ముందు ఆమెను అనేక అవార్డులూ వరించనున్నాయి.

ఇక, ఈ సినిమా విడుదలయ్యాక ప్రచార కార్యక్రమాల్లో, ‘నిత్యా మీనన్ చేయాల్సిన సినిమా కదా ఇది.?’ అంటూ మీడియా ప్రశ్నిస్తే, ‘ఏం, నేను ఆ స్థాయిలో నటించి మెప్పించలేదా.?’ అని ఆనంది ఒకింత నొచ్చుకుంది.

నిత్యా మీనన్ మాత్రమే కాదు, మరో ఇద్దరు నటీమణుల్ని కూడా ‘గరివిడి లక్ష్మి’ బయోపిక్ కోసం ముందుగా అనుకున్నారు. వారిలో ఒరు సాయి పల్లవి కాగా, ఇంకొకరు నివేదా థామస్.

నటన కోణంలో చూస్తే, సాయి పల్లవి కావొచ్చు, నిత్యా మీనన్ కావొచ్చు, నివేదా థామస్ కావొచ్చు.. ఎవరికి వారే.! ఒకర్ని మించి ఇంకొకరు.!

అయితే, ఆనందిని ఈ విషయంలో తక్కువ చేయలేం. నిజానికి, ‘గరివిడి లక్ష్మి’ అనే బయోపిక్‌లో నటించే అదృష్టం పైన పేర్కొన్నా ఆ ముగ్గురికీ దక్కలేదనుకోవాలేమో.!

తెలుసు కదా.. ‘గరివిడి లక్ష్మి’ బయోపిక్ ఓ సాహసోపేతమైన ప్రయోగం.! అసలామెను ఉత్తరాంధ్రలోనే అందరూ మర్చిపోయారు.

దర్శకుడు గౌరి నాయుడు, ‘గరివిడి లక్ష్మి’ని నమ్మాడు.! నిర్మాతలు, దర్శకుడికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. నటీనటులంతా, కథని నమ్మారు, ప్రాణం పెట్టేశారు.

సాంకేతిక నిపుణులూ, సినిమా కోసం అద్భుతంగా పని చేశారు. వెరసి, ‘గరివిడి లక్ష్మి’ వెండితెర అద్భుతంగా ప్రేక్షకుల మన్ననలు పొందింది.

సాయి పల్లవి చేసి వుంటేనా.? అన్న చర్చ అనవసరం. నివేదా థామస్ అదరగొట్టేస్తుంది.. అన్న చర్చ అంతకన్నా అనవసరం. నిత్యా మీనన్ గురించిన ప్రస్తావనలోనూ అర్థం లేదిప్పుడు.

ఆనంది కోసమే, గరివిడి లక్ష్మి బయోపిక్ రాయబడిందేమో.! తన బయోపిక్‌లో తెలుగమ్మాయ్ ఆనంది మాత్రమే నటించాలని బహుశా ‘గరివిడి లక్ష్మి’ బలంగా కోరుకున్నారేమో.!

అందుకే, ఆనంది వెండితెర ‘గరివిడి లక్ష్మి’గా మారింది. నటిగా బోల్డన్ని పేరు ప్రఖ్యాతులు ఇప్పుడు ఆనంది సొంతమయ్యాయి.

సాయి పల్లవి కావొచ్చు, నివేదా థామస్ కావొచ్చు, నిత్యా మీనన్ కావొచ్చు.. ఏ కారణం చేతనో, ఈ సినిమా అవకాశాన్ని తమంతట తాముగా వద్దనుకుని వుంటే మాత్రం.. ఇప్పుడు చాలా బాధపడుతూ వుంటారేమో.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group