The Paradise Pan India.. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా.. ప్యాన్ ఇండియా అని తీరాల్సిందే.! ఓ తెలుగు నటుడు, తమిళ సినిమాలో చేస్తే, ‘ప్యాన్ ఇండియా’ నటుడైపోతున్నాడు.
హీరోయిన్లకీ ప్యాన్ ఇండియా ట్యాగ్స్ ఇచ్చేస్తున్నాం.! హిందీ సినిమాలు, సౌత్‌లోకి డబ్ అయి, ఇక్కడ హిట్లు కొట్టినా హిందీ సినిమాలనే కదా పిలుస్తున్నాం.?
ఔను, నాని ఇదే ప్రస్తావన తీసుకొచ్చాడు. అదీ, తమిళనాడులో. ‘ది ప్యారడైజ్’ సినిమా ప్రమోషన్లలో భాగంగా చెన్నై వెళ్ళాడు నాని.
అక్కడ, నానికి ఓ జర్నలిస్ట్ నుంచి ‘ప్యాన్ ఇండియా’ అంశంపై ప్రశ్న ఎదురైంది. ‘నా సినిమాల్ని ప్యాన్ ఇండియా సినిమాలుగా పిలవొద్దు. ఆ ట్యాగ్ నాకు వద్దు..’ అని నాని చెప్పడాన్ని ప్రస్తావించిందామె.
‘ప్యాన్ ఇండియా ట్యాగ్ వద్దన్నారు కదా.. తమిళనాడులో మీ సినిమాని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు.?’ అంటూ, సదరు జర్నలిస్ట్, నానిని ప్రశ్నించింది.
కొంచెం కంగారు పడినట్లుగా కనిపించాడు నాని. నిజానికి, అది కొంచెం ఇబ్బందికరమైన ప్రశ్నే. కాస్త తేరుకుని, నాని తనదైన స్టయిల్లో సమాధానమిచ్చాడు.
తమిళ సినిమాలు, నార్త్‌లో బాగా ఆడితే ‘ప్యాన్ ఇండియా సినిమా’ అంటున్నాం.. కన్నడ సినిమాలు నార్త్‌లో బాగా ఆడినా ‘ప్యాన్ ఇండియా సినిమా’ అంటున్నాం.. అని నాని చెప్పాడు.
అదే, హిందీ సినిమాలు ‘జవాన్’ కావొచ్చు, ఇంకోటి కావొచ్చు.. సౌత్‌లో బాగా ఆడినా, ‘హిందీ సినిమా’ అనే అంటున్నాం కదా.. అన్నది నాని క్వశ్చన్.!
ఇది నిజంగానే చాలా జెన్యూన్ క్వశ్చన్. ‘నేను, తెలుగు సినిమా అనే చెప్పుకుంటాను. నా తమిళ ఆడియన్స్, నా కన్నడ ఆడియన్స్, నా మలయాళ ఆడియన్స్‌కి నా తెలుగు సినిమా చూపిస్తున్నాను..’ అని చెప్పాడు నాని.
అయితే, నాని వాదనలో నిజాయితీ వున్నప్పటికీ, ‘ప్యాన్ ఇండియా’ అనే అంశం చుట్టూ కమ్ముకున్న ఓ రకమైన ‘మాయ’ నేపథ్యంలో, నాని మీద సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ నడుస్తోంది.
నానికి ఈ నెగెటివిటీ కొత్తేమీ కాదు.! ఇక్కడ నాని ఎవర్నీ కించపర్చలేదు కూడా.! కానీ, నాని మీద ట్రోలింగ్ జరుగుతూనే వుంది.
ఒక్కటి మాత్రం నిజం.. హిందీ సినిమాలకీ ప్యాన్ ఇండియా ట్యాగ్ తగిలించగలిగినప్పుడే, తెలుగు సినిమాలకైనా తమిళ సినిమాలకైనా ప్యాన్ ఇండియా ట్యాగ్ తగలించాలి.
